పుట:Oka-Yogi-Atmakatha.pdf/745

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

709

రాజ్, కాశీలో ఉండే యోగిరాజ్ శ్రీ శ్యామాచరణ్ లాహిరీ మహాశయుల శిష్యశిఖామణి. స్వామి మహారాజ్, భారతదేశంలో అనేక యోగదా సత్సంగ (సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్) కేంద్రాలకు వ్యవస్థాపకులు. అంతేకాకుండా, ఆయన ప్రధాన శిష్యులైన స్వామి యోగానందగారు పాశ్చాత్యదేశాలకు వ్యాప్తిచేసిన యోగవిద్యా ఉద్యమానికి గొప్ప స్ఫూర్తి నిచ్చినవారు ఆయన. మహాసముద్రాలు దాటివెళ్ళి భారతీయ మహామహుల సందేశాన్ని అమెరికాలో వ్యాప్తి చెయ్యాలన్న స్ఫూర్తి, స్వామి యోగానందగారికి కలిగించినది, శ్రీయుక్తేశ్వర్‌గారి భవిష్యత్ దృష్టి, గాఢానుభూతి.”

“భగవద్గీతకూ ఇతర పవిత్ర గ్రంథాలకూ శ్రీయుక్తేశ్వర్‌గారు చేసిన వ్యాఖ్యానాలు ప్రాచ్య పాశ్చాత్యతత్త్వశాస్త్రాలమీద ఆయనకున్న అధికారానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. అంతేకాకుండా అవి, తూర్పుదేశాలకూ పడమటిదేశాలకూ మధ్య నెలకొనవలసిన ఏకత్వ సాధనకు మార్గ నిర్దేశకంగా నిలుస్తాయి. అన్ని మతవిశ్వాసాల ఏకత్వాన్నీ నమ్మే శ్రీయుక్తేశ్వర్ మహారాజ్, మతంలో శాస్త్రీయదృష్టి పొందుపరచడానికి వివిధ తెగల, సంప్రదాయాల నాయకుల సహకారంతో ‘సాధుసభ’ స్థాపించారు. మరణ సమయంలో ఆయన, సాధుసభ అధ్యక్ష స్థానానికి తమకు వారసులుగా స్వామి యోగానందగారిని నియమించారు.”

“అటువంటి మహాపురుషుల మరణం భారతదేశానికి తీరని లోటు. ఆయన సాన్నిహిత్యం పొందే అదృష్టం కలిగినవారందరూ భారతదేశ సంస్కృతిలోని నిజమైన స్ఫూర్తినీ ఆయనలో మూర్తీభవించిన సాధననూ తమ అంతరంగాల్లో పొందుపరుచుకుందురుగాక!”

నేను కలకత్తాకు తిరిగి వచ్చాను. పవిత్ర స్మృతులుగల శ్రీరాంపూర్ ఆశ్రమానికి అప్పుడే వెళ్ళగలనన్న విశ్వాసం లేనందువల్ల, శ్రీరాం