పుట:Oka-Yogi-Atmakatha.pdf/744

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

708

ఒక యోగి ఆత్మకథ

ముందు, గురుదేవులకు కొద్దిగా జ్వరం వచ్చింది; కాని ఆయన అనంతధామంలోకి ఆరోహించడానికి ముందు రోజున, ఆయన శరీరానికి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. ప్రియమైన ఆయన దేహంవేపు నేను ఎన్నిసార్లు చూసినప్పటికీ, దాంట్లోంచి ప్రాణం పోయిందని అనిపించేటట్టే లేదు. ఆయన చర్మం నున్నగా మెత్తగా ఉంది. ముఖంలో ప్రశాంతమైన దివ్యానందం వ్యక్తమవుతూ ఉంది. మార్మికమైన పిలుపు వచ్చిన సమయంలో ఆయన, స్పృహతోనే దేహాన్ని విడిచిపెట్టారు.

“బెంగాల్ సింహం వెళ్ళిపోయింది,” అంటూ వాపోయాను.

మార్చి 10 న అంత్యక్రియలు జరిపాను. సన్యాసులకు విధించిన సనాతన పద్ధతి కర్మకాండ ప్రకారం శ్రీయుక్తేశ్వర్‌గారిని, పూరీ ఆశ్రమం తోటలో సమాధిచెయ్యడం[1] జరిగింది. ఆ తరవాత, ఆయన శిష్యుల్లో దగ్గరలో ఉన్నవాళ్ళూ దూరాల్లో ఉన్నవాళ్ళూ మేష సంక్రమణ సందర్భంగా గురుదేవులకు శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చారు. కలకత్తాలో ప్రముఖమైన అమృత బజార్ పత్రిక, ఆయన బొమ్మ ఒకటి వేసి, ఆయన్ని గురించి ఇలా రాసింది:

“81 సంవత్సరం వయస్సుగల శ్రీమత్ స్వామి శ్రీయుక్తేశ్వర్ గిరి మహారాజ్ మరణ భండార కాండ మార్చి 21 న పూరీలో జరిగింది. దీనికి చాలామంది శిష్యులు పూరీ పెళ్ళారు.”

“భగవద్గీత వ్యాఖ్యాతల్లో అగ్రేసరుల్లో ఒకరయిన స్వామి మహా

  1. హిందువుల అంత్యక్రియలకు సంబంధించిన కర్మకాండలో గృహస్థుల్ని దహనం చెయ్యాలని విధించారు; స్వాముల్నీ ఇతర సంప్రదాయాల సన్యాసుల్నీ, దహనం చెయ్యకుండా నేలలో పూడుస్తారు. (సందర్భానుసారంగా, వీటికి మినహాయింపులు ఉన్నాయి). సన్యాసుల శరీరాలు, సవ్యాసదీక్ష తీసుకునే సమయంలో ప్రతీకాత్మకంగా, జ్ఞానమనే అగ్నిలో దగ్ధమై పోయినట్టు పరిగణిస్తారు.