పుట:Oka-Yogi-Atmakatha.pdf/716

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

680

ఒక యోగి ఆత్మకథ

ప్రతిభాశాలి అయిన ఈ హిందూ భౌతికశాస్త్రవేత్త, కాంతి విస్తరణలో ముఖ్యమైన “రామన్ ఎఫెక్ట్” కనిపెట్టినందుకు 1930 లో నోబెల్ బహుమతి అందుకున్నారు.

ఒక పక్క మనస్సు వెనక్కు లాగుతూనే ఉన్నా, అసంఖ్యాకులైన మద్రాసు విద్యార్థులకూ మిత్రులకూ వీడుకోలు చెప్పి శ్రీ రైటూ నేనూ ప్రయాణం సాగించడానికి పూనుకున్నాం. దారిలో మేము కొద్ది సేపు, సదాశివబ్రహ్మం[1] గారి స్మారకార్థం నెలకొన్న పవిత్రమైన చిన్న ఆలయాన్ని దర్శించడానికి ఆగాం. పద్దెనిమిదో శతాబ్దిలో జీవించిన ఈ మహాయోగి జీవితగాథ, అనేక అలౌకిక ఘటనలతో నిండి ఉన్నది. సదాశివబ్రహ్మంగారి స్మారకార్థం నేరూరులో అంతకన్న పెద్ద గుడి ఉంది; దీన్ని పుదుక్కోట రాజుగారు కట్టించారు. అనేక దైవీచికిత్సలకు సాక్షిగా నిలిచిన యాత్రాస్థల మిది. అప్పట్లో పరిపాలన చేసే యువరాజుకు మార్గదర్శకంగా ఉండడంకోసం 1750 లో సదాశివ బ్రహ్మంగారు రాసిన ధర్మోపదేశాల్ని, పుదుక్కోట రాజ్యాన్ని ఏలిన తరవాతి పాలకులు పవిత్రంగా భద్రపరిచారు.

ప్రేమాస్పదులూ పరిపూర్ణ జ్ఞానసంపన్నులూ అయిన సదాశివ బ్రహ్మంగారిని గురించిన అద్భుత కథలు అనేకం, ఈనాటికి దక్షిణభారత గ్రామాల్లో ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు కావేరీనది ఒడ్డున

  1. ఈయనకు గల ఆశ్రమోచితమైన బిరుదు స్వామి శ్రీ సదాశివేంద్ర సరస్వతి; ఈ పేరుతోనే ఆయన పుస్తకాలు (బ్రహ్మసూత్రాలకూ, పతంజలి యోగసూత్రాలకూ వ్యాఖ్యానాలు) రాశారు.

    మైసూరు రాజ్యంలో శృంగేరి పీఠాధిపతులుగా ఉండి కీర్తిశేషులైన శ్రీశ్రీ చంద్రశేఖర భారతి స్వామివారు సదాశివబ్రహ్మంగారిని కీర్తిస్తూ ఒక స్తోత్రం రాశారు.