పుట:Oka-Yogi-Atmakatha.pdf/707

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దక్షిణ భారత విహారయాత్ర

671

ఉన్నవని గ్రహించేవీ, నాకు రోజూ తిండిపెట్టే మొక్కలు నా దప్పిక తీర్చే నీళ్ళూను. ఆబగా కూడబెట్టుకున్న వస్తుసంపదలు, అవి కూడబెట్టిన వాళ్ళకి వినాశకరమైనవని రుజువవుతాయి; అజ్ఞానుల్ని పీడించే దుఃఖాన్నీ విసుగుదలనూ మాత్రమే కలిగిస్తాయవి.

“నే నయితే, అడవిలో ఉండే చెట్ల ఆకులమీద పడుకుంటాను. కాపలా కాసుకోడానికి నాకు ఏమీ లేదు; ప్రశాంతమైన నిద్రలో కళ్ళు మూసుకొని ఉంటాను, అలా కాకుండా, ప్రాపంచిక విలువ కలిగింది ఏదైనా కనక నాకు ఉండి ఉంటే, దాని భారం నా నిద్రను తరిమేసేది. ఈ భూమి నాకు ప్రతిదీ ఇస్తుంది, తల్లి తన పిల్లకు పాలు ఇచ్చినట్టే. నా ఇష్టంవచ్చిన చోటికి నేను పోతాను, భౌతికమైన జాగ్రత్తల బెడద ఏమీ లేకుండా.”

“అలెగ్జాండరు నా తల నరికేసినా కూడా, నా ఆత్మను నాశనం చెయ్యలేడు. అప్పుడు, మౌనం దాల్చిన నా తలా చిరిగిన బట్టలాంటి నా దేహమూ భూమిమీద ఉండిపోతాయి; వాటిని తీసుకున్నదే అక్కణ్ణించి. నే నప్పుడు ఆత్మరూపుణ్ణి అయి, నా దేవుడి దగ్గరికి పైకి పోతాను; మనల్ని అందరినీ మాంసకోశంలో ఉంచి కింద ఇక్కడున్నప్పుడు మనం తన ఆజ్ఞలకు బద్ధులమై బతుకుతామో లేదో నిరూపించడానికి మనని ఈ భూమిమీద వేసినవాడూ మనం ఇక్కణ్ణించి వెళ్ళిన తరవాత తన సన్నిధికి చేరినప్పుడు మన జీవితాల మంచిచెడ్డలకు మనదగ్గర సంజాయిషీ తీసుకునే వాడూ ఆయన. పొగరుబోతు పాడుపనులన్నిటికీ న్యాయనిర్ణేత ఆయనే; అణిచివేతకు గురిఅయినవాళ్ళ మూలుగులు ఆ ఆణిచివేతదారుకు శిక్ష విధిస్తాయి.”

“అంచేత అలెగ్జాండర్ని, సంపద కోరేవాళ్ళనీ, చావుకు భయపడే వాళ్ళనీ బెదిరింపులతో భయపెట్టనియ్యి. బ్రాహ్మణుల ముందు అతని