పుట:Oka-Yogi-Atmakatha.pdf/706

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

670

ఒక యోగి ఆత్మకథ

విముక్తి కలిగించినప్పుడు - వాళ్ళిక ఏ విధంగానూ దుష్టవ్యాధికి లోను కానక్కరలేని స్థితిలో - ఆయన అందరినీ దగ్గరికి చేర్చుకుంటాడు. హత్యల్ని అసహ్యించుకునేవాడూ యుద్ధాలు రగిలించనివాడూ- ఆయనే నా ప్రణామాలందుకునే దేవుడు.”

“అలెగ్జాండరు దేవుడేమీ కాడు, అతను కూడా చావుకు లోబడి తీరవలసినవాడే కనక,” అంటూ ఆ తపస్వి, తిరస్కార ధోరణిలో ఇంకా ఇలా అన్నాడు: “ఇంతదాకా ఆంతరిక విశ్వసామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించని అటువంటివాడు ప్రపంచాధిపతి ఎలా అవుతాడు? అతనింత వరకూ నరకంలోకి కూడా ప్రవేశించలేదు. ఈ భూమిమీద, సువిశాల ప్రాంతాలమీద సంచరించే సూర్యుడి గమనరీతిని ఎన్నడూ ఎరగనైనా ఎరగడు. అనేక దేశాలు అతని పేరు విననైనా వినలేదే!”

ఈ విధంగా ఆ తపస్వి, “ప్రపంచానికి అధినాథుడు” అనిపించుకొన్నవాడి చెవులు గింగురులెత్తి పోయే విధంగా, ఎన్నడూ విననంత తీవ్రంగా ముక్కచివాట్లు పెట్టి, వ్యంగంగా ఇంకా ఇలా అన్నాడు, “అలెగ్జాండరుకు ఇప్పుడున్న రాజ్యాలు అతని కోరికలకు తగినంత విస్తారంగా లేకపోయినట్లయితే, అతన్ని గంగానది దాటమను; అతని మనుషులందరినీ నిలవరించగల దేశాన్ని చూస్తాడు.[1]

“ఇదుగో, ఇది తెలుసుకో; అలెగ్జాండరు ఇస్తాననే కానుకలు నాకు ఎంతమాత్రం పనికిరానివి; నేను కానుకగా తలిచేవీ నిజమైన విలువ

  1. అలెగ్జాండరు కాని, అతని సేనానాయకులు కాని గంగానదిని ఎన్నడూ దాటలేదు. వాయవ్యం నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవడం చూసి మాసిడోనియా సైన్యం, మరి ముందుకు చొచ్చుకొని పోమంటూ తిరుగుబాటు చేసింది; అలెగ్జాండరు భారతదేశాన్ని విడవక తప్పింది కాదు. తరవాత అతనికి పెర్షియాలో విజయాలు లభించాయి.