పుట:Oka-Yogi-Atmakatha.pdf/704

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

668

ఒక యోగి ఆత్మకథ

చాడు. మెగస్తనీస్, సుఖవంతమూ కార్యోత్సాహవంతమూ అయిన ఆనాటి భారతదేశాన్ని గురించి మనకు వివరాలు రాసి పెట్టాడు.

విజయధ్వజుడయిన చంద్రగుప్తమౌర్యుడు క్రీ. పూ. 298 లో భారత ప్రభుత్వాధిపత్యాన్ని తన కొడుకు చేతుల్లో పెట్టాడు. దక్షిణ భారతానికి యాత్ర సాగించి, తన జీవితంలో చివరి పన్నెండేళ్ళూ చేత కాసులేని సన్యాసిగా గడిపాడు; ఈనాడు మైసూరు రాజ్యంలో ఒక ఆలయంగా ఉన్న, శ్రవణబెళగోళ కొండ గుహలో ఆత్మసాక్షాత్కారం కోసం తపస్సు చేశాడు. ప్రపంచమంతటిలోకీ అత్యున్నత శిలావిగ్రహమున్నది ఆ ప్రదేశంలోనే. భారీ పరిమాణంగల గట్టి రాతితో చెక్కన ఈ విగ్రహం, గోమఠేశ్వరమునిపేర క్రీ.శ. 983లో జైనులు ప్రతిష్ఠించినది.

అలెగ్జాండరు భారతదేశం మీదికి దండెత్తి వచ్చినప్పుడు అతని వెంబడి వచ్చినవాళ్ళూ లేదా ఆ తరవాత వచ్చినవాళ్ళూ - గ్రీకు చారిత్రకులూ తదితరులూ- చిన్న చిన్న వివరాలతో సహా రాసి పెట్టిన వాటిలో

ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఏరియన్, డియోడరస్, ఫ్లూటార్క్, భూగోళశాస్త్రజ్ఞుడు స్ట్రాబో రాసిన వృత్తాంతాల్ని, డా॥ జె. డబ్ల్యు. మెక్ క్రిండిల్,[1] ప్రాచీన భారతదేశ చరిత్రను వెలుగులోకి తేవడానికి అనువాదం చేశాడు. అలెగ్జాండరు భారతదేశం మీద దాడిచేసి విఫలుడు కావడంలో అత్యంత శ్లాఘనీయమైన విషయం ఏమిటంటే, హిందూ దర్శన శాస్త్రంలోనూ యోగుల విషయంలోనూ పుణ్యపురుషుల విషయంలోనూ

  1. ‘ఏన్షెంట్ ఇండియా’ (ప్రాచీన భారతదేశం) ఆరు సంపుటాలు (కలకత్తా: చక్రవర్తి, ఛటర్జీ అండ్ కంపెనీ, 15, కాలేజీ స్క్వేర్, 1879, పునఃప్రచురణ, 1927).