పుట:Oka-Yogi-Atmakatha.pdf/697

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 41

దక్షిణ భారత విహారయాత్ర

“ఆ గుళ్ళోకి ప్రవేశించిన మొట్టమొదటి పాశ్చాత్యుడివి నువ్వే, డిక్. ఇదివరలో ఎంతో వుంది ప్రయత్నంచేసి విఫలులయ్యారు.”

నా మాటలకు శ్రీ రైట్ ఆశ్చర్యపడినప్పటికీ తరవాత సంతోషంచాడు. అంతకు ముందే మేము, దక్షిణ భారతంలో మైసూరు నగరాన్ని పరివీక్షించే ఒక కొండమీద ఉన్న సుందరమయిన చాముండేశ్వరి ఆలయం లోంచి బయటికి వచ్చాం. అక్కడ మేము, మైసూరు రాజవంశం వారి కుల దేవత అయిన చాముండి స్వర్ణ, రజత పీఠాల ముందు మోకరిల్లాం.

శ్రీ రైట్, కొన్ని గులాబి రేకుల్ని జాగ్రత్తగా చుట్టి పెట్టుకుంటూ, “ఈ విశిష్ట గౌరవానికి జ్ఞాపక చిహ్నంగా, పూజారి పన్నీటితో పవిత్రం చేసిన ఈ గులాబిరేకుల్ని ఎప్పటికీ దాచిపెట్టుకుంటాను,” అన్నాడు.

నా సహచరుడూ నేనూ[1] మైసూరు రాజ్యం అతిథులుగా 1935 నవంబరు నెల గడుపుతున్న రోజులవి. మహారాజావారి వారసులు యువరాజ శ్రీ కంఠీరవ నరసింహరాజు ఒడయరుగారు, ఉత్తమ సంస్కారవంతమూ అభ్యుదయశీలమూ అయిన తమ రాజ్యాన్ని సందర్శించవలసిందిగా నన్నూ నా కార్యదర్శినీ కోరారు.

  1. శ్రీ రైట్, నేనూ సాగినంత చురుకుగా మాతో సంచారం చేయలేక, మిస్ బ్లిట్ష్, హాయిగా కలకత్తాలో మా బంధువుల దగ్గర ఉండిపోయింది.