పుట:Oka-Yogi-Atmakatha.pdf/695

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశానికి తిరిగి రాక

659

దక్షిణేశ్వర మఠం, యోగదా సత్సంగ సొసైటీకి భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో దానికున్న విద్యాలయాలకూ కేంద్రాలకూ ఆశ్రమాలకూ ప్రధాన కార్యాలయం. యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయానికి చట్టబద్ధంగా అనుబంధమై ఉంది; ఈ కార్యాలయం అమెరికాలో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిలస్‌లో ఉంది. యోగదా సత్సంగ కార్యకలాపాల్లో, ‘యోగదా మేగజైన్’ అనే త్రైమాసిక పత్రిక ఒకటి ప్రచురించడం, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న విద్యార్థులకు నెలనెలా పోస్టులో పాఠాలు పంపడం కూడా ఉన్నాయి. ఈ పాఠాలు శక్తి పూరణ, ధారణ, ధ్యాన ప్రక్రియల్ని వివరణాత్మకంగా బోధిస్తాయి. సంపూర్ణ విశ్వాసంతో వాటిని సాధన చేసినట్లయితే, అర్హులైన విద్యార్థులకు ముందు