పుట:Oka-Yogi-Atmakatha.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

482

ఒక యోగి ఆత్మకథ

కాంతి దృగ్విషయాల గురించి తనకు గల దివ్యజ్ఞానాన్ని ఉపయోగించ గలుగుతాడు. ప్రక్షేపణ వాస్తవరూపం (ఒక చెట్టు, ఒక మండు, ఒక మానవదేహం; ఏదైనా సరే) యోగి అభిలాషనుబట్టి, అతని సంకల్ప శక్తినిబట్టి, మానస దర్శనశక్తిబట్టి నిర్ణయమవుతుంది.

రాత్రివేళ మనిషి, స్వప్న చేతన స్థితిలోకి ప్రవేశించి, పగటిపూట తన చుట్టూ ఆవరించి ఉండే, అహంభావపరమైన తప్పుడు పరిమితుల నుంచి తప్పించుకుపోతాడు. నిద్రలో అతనికి, అతని మనస్సుకున్న సర్వ శక్తిమత్త్వం ఎప్పటికీ పునరావర్తనమయే విధంగా ప్రదర్శితమవుతూ ఉంటుంది. కలలో, ఏనాడో చనిపోయిన అతని స్నేహితులూ బహుదూరపు ఖండాలు చిన్ననాటి పునరుత్థిత దృశ్యాలూ అన్నీ అపుపిస్తాయి.

మనుషులందరికీ స్వప్న దృగ్విషయాల్లో సంగ్రహంగా తెలిసిన స్వతంత్ర, అనిబద్ధ చైతన్యమే, దైవానుసంధానం కావించిన సాధువుకుండే శాశ్వత, పరిపూర్ణ మనఃస్థితి. దేశకాలాలకు అధిపతి అయి, వ్యక్తిగత ఉద్దేశాలేవీ పెట్టుకోకుండా, సృష్టికర్త తనకు ప్రసాదించిన సృజనాత్మక ఇచ్ఛాశక్తిని ఉపయోగించుకొంటూ యోగి, భక్తుడు చిత్తశుద్ధితో చేసిన ఏ ప్రార్థననైనా సరే ఫలింపజేయడానికి, విశ్వంలోని కాంతి అణువుల్ని పునర్వ్యవస్థితంచేస్తాడు.

“మానవుణ్ణి మన రూపంలో, మన లక్షణాలతో తయారుచేద్దాం. సముద్రంలో ఉన్న చేపలమీద, గాలిలో పక్షులమీద, పశువులమీద, సమస్త భూమిమీద, నేలమీద పాకే ప్రతి జీవిమీదా వాళ్ళకు అధికారం ఇద్దాం, అనుకొన్నాడు దేవుడు.”[1]

ఈ ప్రయోజనం కోసమే మనిషినీ సృష్టినీ చెయ్యడం జరిగింది:

  1. జెనిసిన్ 1 : 26 (బైబిలు)