పుట:Oka-Yogi-Atmakatha.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

ఒక యోగి ఆత్మకథ

లోనే నాకు చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ, అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్ళి చేసుకోడానికి త్వరలోనే తను, బెరైలీ నుంచి కలకత్తా వెళ్ళిపోవాలి. ఆ పరిస్థితిలో, ఒకనాడు సాయంత్రం నన్ను దగ్గరికి పిలిచాడు.

“ముకుందా, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టంలేక ఇన్నాళ్ళూ వెనకాడుతూ వచ్చాను.” అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. “ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా, నీలో దైవసంబంధమైన ఉత్సాహం పెల్లుబుకుతూ ఉంది. ఈమధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నే నొక కచ్చితమైన తీర్మానం చేసుకున్నాను. మనఃపూర్తిగా నేను చేసిన వాగ్ధానాన్ని ఇక ఏ మాత్రం వాయిదా వెయ్యగూడదనుకున్నాను.” ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య.

“నాయనా, ముకుందా! నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి!” అంది అమ్మ. “నువ్వు పుట్టిన తరవాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే, నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను, కాశీలో ఉన్న మా గురువుగారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనక నేను దాదాపు, మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగిఉన్న లాహిరీ మహాశయుల్ని సరిగా చూడలేకపోయాను కూడా.

“మహాగురువులు నిన్ను గమనించాలనీ, నిన్ను ఆశీర్వదించాలనీ- ఒకవైపు నిన్ను జోకొడుతూ- ప్రార్థిస్తున్నాను. మౌనంగా, భక్తిపూర్వ