పుట:Oka-Yogi-Atmakatha.pdf/448

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

412

ఒక యోగి ఆత్మకథ

మీద (నేనే పెద్దవాణ్ణి కనక) సుతారంగా ఒక్కటి అంటించి, మా పిల్ల తగువుల్ని అప్పటిమట్టుకు సర్దుబాటు చేసేది.

నళినికి చదువు అయిపోయాక, డా॥ పంచానన్ బోస్ కిచ్చి పెళ్ళిచెయ్యడానికి నిశ్చయమైంది. యోగ్యుడయిన ఈ యువకుడు కలకత్తాలో డాక్టరు. సుదీర్ఘమైన పెళ్ళి తతంగాలన్నీ సకాలంలోనే జరిగాయి. పెళ్ళినాటి రాత్రి నేను, మా కలకత్తా ఇంట్లో, నట్టింట్లో కులాసాగా ముచ్చట్లాడుకుంటున్న పెద్ద బంధువర్గంతో కలిసి కూర్చున్నాను. పెళ్ళికొడుకు, నిండుగా బంగారపు జరీగల తలగడా మీదికి వాలి కూర్చున్నాడు. ఆయన పక్కనే కూర్చుంది నళిని. ముచ్చటైన బచ్చలపండు వన్నె పట్టుచీర కూడా ఆమె బక్కతనాన్ని పూర్తిగా మరుగుపరచలేకపోయింది. నేను మా కొత్త బావగారి తలగడా వైపుచేరి స్నేహపూర్వకంగా పళ్ళు ఇకిలించాను. పెళ్ళిరోజు దాకా ఆయన నళినిని చూడలేదు; పెళ్ళి లాటరీలో తనకి దక్కేదేమిటో చివరికి తెలుస్త అప్పుడే. నా సానుభూతి అందుకున్న డా. బోస్, సిగ్గుపడుతూ నళినివేపు చూపించి, “ఇదేమిటంటావ్?” అని నా చెవిలో గొణిగాడు.

“ఏమిటేమిటి డాక్టర్? మీ పరిశీలనకోసం ఓ ఎముకలగూడు!”

ఏళ్ళు గడిచేకొద్దీ, డా॥ బోసు మా కుటుంబానికి ఆప్తుడవుతూ వచ్చాడు; ఒంట్లో నలతచేసినప్పుడల్లా మావాళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆయనా నేనూ దగ్గరి స్నేహితులమయాం; ఇద్దరం కలిసి వేళాకోళం చేసేవాళ్ళం - ఎవరినో చెప్పక్కర్లేదు - సాధారణంగా నళిని మీదే మా విసుర్లు.

ఒక నాడు నాతో అన్నారు మా బావగారు: “వైద్యులకు విస్మయం కలిగించే సంగతిది. బక్క పలచటి మీ చెల్లెలిమీద ఎన్నో ప్రయోగాలు చేసి చూశాను - కాడ్‌లివర్ ఆయిలు, వెన్న, మాల్తు, తేనె, చేపలు,