పుట:Oka-Yogi-Atmakatha.pdf/443

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

407

బహుశా, యోగశాస్త్రం[1]పట్ల ప్రయోజనాత్మకమైన ఆసక్తి కావచ్చు; ఇది నిజంగా, “బాంబు దెబ్బకు ధ్వంసంకాని గూడు.”

  1. తెలియనివాళ్ళు చాలామంది, యోగాన్ని ‘హఠయోగం’గా చెబుతారు; లేదా అద్భుత శక్తులు సంపాదించడానికి ఉపకరించే క్షుద్రమైన రహస్య కాండగల “ఇంద్రజాలం” గా పరిగణిస్తారు. అయితే, యోగాన్నిగురించి విద్వాంసులు ముచ్చటించేటప్పుడు, యోగసూత్రాల్లో (వీటిని పతంజలి సూత్రాలని కూడా అంటారు) లేదా ‘రాజయోగం’లో ప్రవచించిన శాస్త్రాన్నే ఉద్దేశించి చెబుతారు. ఆ గ్రంథంలో పొందుపరిచిన దార్శనిక భావనలు ఎంత అద్భుతమైనవంటే, భారతదేశపు మహామనీషుల్లో కొందరు వాటిమీద ఉత్తేజకరమైన వ్యాఖ్యానాలు రచించారు; అటువంటివారిలో ఒకరు పరమజ్ఞాని సదాశివేంద్రులు (41 అధ్యాయంలో చివర చూడండి). వేదప్రమాణాన్ని అంగీకరించే తక్కిన ఐదు సనాతన ఆస్తిక దర్శనాల మాదిరిగానే యోగసూత్రాలు కూడా, పటిష్ఠమైన దార్శనిక శోధనకు నైతిక పరిశుద్ధత అనే “ఇంద్రజాలాన్ని” (యమ నియమాది విధులను) తప్పనిసరిగా ఉండవలసిన ప్రాథమికావసరంగా పరిగణిస్తాయి. పాశ్చాత్యదేశాల్లో నిష్కర్షగా విధించని ఈ వ్యక్తిగత సాధన, భారతీయ షడ్దర్శనాలకు శాశ్వత శక్తిని ప్రసాదించింది. విశ్వాన్ని పరిరక్షించే బ్రహ్మాండ వ్యవస్థ (ఋతం) మానవ భవితవ్యాన్ని నిర్ణయించే నైతిక వ్యవస్థకు భిన్నమైనది కాదు. విశ్వజనీనమైన, నైతికనియమాల్ని, పాటించడానికి సుముఖంగా లేనివాడు, సత్యాన్ని అన్వేషించడానికి దృఢసంకల్పుడు కానివాడే. ‘యోగసూత్రాలు’ 3 వ పాదంలో యోగసంబంధమైన, వివిధ అలౌకిక శక్తుల్ని (విభూతులు, సిద్ధులు) పేర్కోడం జరిగింది. నిజమైన జ్ఞానం ఎప్పుడూ శక్తే, యోగమార్గాన్ని నాలుగు దశలుగా విభజించారు; ఒక్కొక్కదానికి ఒక్కొక్క విభూతిని ప్రత్యేకంగా వర్ణించారు. ఒకానొక శక్తిని సాధించిన తరవాత యోగి, ఆ నాలుగింటిలోనూ ఒక దశను దాటినట్టు తెలుసుకుంటాడు. స్వాభావికమైన శక్తులు బహిర్గతం కావడం, యోగవిద్య శాస్త్రీయతకు నిదర్శనం; ఇందులో ఒకరి “ఆధ్యాత్మిక ప్రగతి”ని గురించి భ్రమతో కూడిన ఊహలు చెయ్యడం నిషిద్ధం; రుజువు కావాలి. ఆత్మతో ఐక్యమే ఏకైకలక్ష్యం కావాలి కాని విభూతులు సంపాదించడం కాగూడదని, అవి కేవలం పవిత్రమార్గంలో పడే పుష్పాలు మాత్రమేనని పతంజలి సాధుకుణ్ణి హెచ్చరిస్తాడు. శాశ్వత ప్రదాతను అన్వేషించాలి కాని ఆయన ప్రసాదించే సిద్ధుల్ని కాదు; స్వల్ప ఉపలబ్ధులతో తృప్తిపడే అన్వేషకుడికి దేవుడు దర్శనమియ్యడు. అందువల్ల సరిగా సాధనచేసే యోగి తన సిద్ధుల్ని వినియోగించు కోకుండా జాగ్రత్తపడతాడు; లేకపోతే అవి, మిథ్యాహంకారం కలిగించి కైవల్య చరమావస్థకు చేరకుండా పక్కదారి పట్టిస్తాయి.

    యోగి తన అనంత లక్ష్యాన్ని చేరినప్పుడు విభూతులు ప్రదర్శించవచ్చు, ప్రదర్శించకపోవచ్చు; అది అతని ఇచ్ఛానుసారం. అప్పుడతని చర్యలు, అలౌకిక ఘటనాపరమయినా కాకపోయినా, కర్మబంధం లేకుండానే జరుగుతాయి. వ్యక్తిపరమైన అహంకారమనే అయస్కాంతం ఇంకా ఉన్నచోటే, కర్మఅనే ఇనప రజనును ఆకర్షించడం జరుగుతుంది.