పుట:Oka-Yogi-Atmakatha.pdf/442

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

406

ఒక యోగి ఆత్మకథ

సాధనలో, ప్రాణమన్నది ఊపిరే కాకుండా బ్రహ్మాండంలోని విశ్వసంచాలకశక్తి కూడా.

“యోగానికి ఆధారభూతమైన భావనల్ని గ్రహించుకోకుండా చేసే యోగసాధన వ్యర్థం. శారీరక, ఆధ్యాత్మిక భావనల్ని రెంటినీ ఇది, అసాధారణ రీతిలో, ఒకదాంతో ఒకటి సంపూర్ణంగా మిళితం చేస్తుంది.

“ఈ భావాల్నీ ప్రక్రియల్ని రూపొందించిన, అనేక వేల సంవత్సరాల అవిచ్ఛిన్న సంప్రదాయ ఫలంగా అవసరమైన ఆధ్యాత్మిక పునాదులు ఏర్పడ్డ తూర్పుదేశాల్లో, యోగశాస్త్రం, శరీరాన్నీ మనస్సునూ సమైక్యం చేసే సంపూర్ణ, సముచిత పద్ధతి అని, వాటి సమైక్యాన్ని ప్రశ్నించే తావు లేదని నేను నిస్సంకోచంగా విశ్వసించగలను. ఈ సమైక్యం, చైతన్యాన్ని అధిగమించే అతీంద్రియ సహజావబోధాల్ని సాధ్యంచేసే మానసికావస్థను కల్పిస్తుంది.”

భగవత్స్వరూపమైన ప్రకృతిని బాహ్యంగా జయించడం ఎంత అవసరమో ఆత్మసంయమమనే అంతర్విజ్ఞానం కూడా అంత అవసరమని గ్రహించే రోజు పడమటిదేశాలకు దగ్గరపడుతోంది. పదార్థమనేది వాస్తవానికి ఘనీభూతశక్తి అని శాస్త్రీయంగా ప్రస్తుతం నిర్వివాదమైన సత్యం వల్ల మానవుల మనస్సులు శాంతపడి, విశాలమయే రోజు అణుయుగంలో వస్తుంది. రాళ్ళూ లోహాలవంటి పదార్థాలలోని శక్తులకన్న మహత్తరమైన శక్తుల్ని మానవమనస్సు తనలోంచే విడుదల చెయ్యగలదు; చేసితీరాలి కూడా; లేకపోతే కొత్తగా బంధవిముక్తి పొందిన భౌతిక అణు (రాక్షస) శక్తి ప్రపంచంమీద విరుచుకుపడి పిచ్చిగా నాశనం చేస్తుంది. ఆటం బాంబులగురించి మానవజాతికి గల ఆందోళనవల్ల కలిగే పరోక్షలాభం,