పుట:Oka-Yogi-Atmakatha.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను సన్యాసం తీసుకోడం

399

శాఖల్లో కొన్ని: ‘సాగర’ (సముద్రం), ‘భారతి’ (భూమి), ‘పురి’ (ప్రదేశం), ‘సరస్వతి’ ( ప్రకృతి జ్ఞానం), ‘అరణ్య’ (అడవి), ‘తీర్థ’ (పుణ్యస్థలం) శాఖలు.

సాధారణంగా స్వాముల సన్యాసాశ్రమం చివర ఉండే ‘ఆనంద’ శబ్దం, ఒకానొక నిర్దిష్ట మార్గంలో, స్థితిలో, లేదా దివ్యవిశిష్టత ద్వారా మోక్షం సాధించాలన్న ఆశయాన్ని సూచిస్తుంది; ప్రేమ, జ్ఞానం, వివేకం, భక్తి, సేవ, యోగం అన్నవాటిలో ఏదైనా అందుకు ఉపకరించవచ్చు.

మానవజాతి కంతకీ నిస్స్వార్థంగా సేవ చెయ్యాలనీ వ్యక్తిగత సంబంధాల్నీ ఆకాంక్షల్నీ విడిచిపెట్టాలనీ ఏర్పరచుకొన్న ఆదర్శంవల్ల స్వాముల్లో చాలామంది, భారతదేశంలోకాని అప్పుడప్పుడు విదేశాల్లోకాని, మానవసేవలోనూ విద్యాసంబంధమైన కార్యకలాపాల్లోనూ చురుకుగా పాల్గొంటూ ఉంటారు. కుల, మత, వర్గ, వర్ణ, లింగ, జాతి విద్వేష దురభిమానాలన్నిటినీ విడిచిపెట్టి స్వామి, మానవ సౌభ్రాత్ర నియమాల్ని పాటిస్తాడు. కేవల పరబ్రహ్మైక్యమే అతని లక్ష్యం. “నేనే ఆయన” (సో౽హం) అన్న భావనతో జాగృత, సుప్తచైతన్యాన్ని మథిస్తూ సంతుష్ట మనస్కుడయి ప్రపంచంలో విహరిస్తాడు కాని, ప్రపంచానికి చెందడు. అప్పుడే అతనికి ‘స్వామి’ - ‘స్వ’ అంటే ఆత్మ; దాంతో ఐక్యం కావడానికి యత్నించేవాడు స్వామి - అన్న బిరుదు సార్థక మవుతుంది.

శ్రీయుక్తేశ్వర్‌గారు సన్యాస మఠామ్నాయంలో సంబంధమున్న కారణంగా, స్వామి అయినవాడల్లా యోగి కానక్కరలేదు. దైవసాక్షాత్కారం కోసం శాస్త్రీయమైన ఒక పద్ధతిని సాధన చేసేవారు ఎవరయినా యోగే. ఆయన పెళ్ళయినవాడు కావచ్చు, పెళ్ళి కానివాడు కావచ్చు;