పుట:Oka-Yogi-Atmakatha.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

398

ఒక యోగి ఆత్మకథ

యంలో చాలామంది ― బహుశా పదిలక్షల మంది - స్వాములు ఉన్నారు; అందులో ప్రవేశించడానికి వారు పాటించవలసిన నియమం, సన్యాసులైన వారి దగ్గరే దీక్ష తీసుకోడం. ఈ ప్రకారంగా, సన్యాస మఠామ్నాయంలోని స్వాములందరూ, గురుసార్వభౌములైన ఆది (“మొట్టమొదటి”) శంకరాచార్యులవారి నుంచే తమ ఆధ్యాత్మిక పరంపర మొదలైనట్టు భావిస్తారు. వీరు పేదరికాన్ని (వస్తు సంపదపట్ల నిర్మమత్వం), బ్రహ్మచర్యాన్నీ, మఠాధిపతిపట్ల విధేయతనూ పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. కేథలిక్ క్రైస్తవుల సన్యాసాశ్రమ విధులు కూడా చాలా విధాల, అంతకన్న ప్రాచీనమైన మఠామ్నాయ విధుల్ని పోలి ఉంటాయి. ప్రతి స్వామీ తన కొత్త పేరుకు చివర, మఠామ్నాయంలోని పది ఉపవిభాగాల్లోనూ ఒకదానితో తనకున్న ఔపచారిక సంబంధాన్ని సూచించే పదం ఒకటి చేర్చుకుంటాడు. ఈ ‘దశనామి’ విభాగాల్లో ఒకటి ‘గిరి’ (కొండ) శాఖ; శ్రీయుక్తేశ్వర్‌గారూ వారివల్ల నేనూ, ఈ శాఖకు చెందినవాళ్ళం. తక్కిన