పుట:Oka-Yogi-Atmakatha.pdf/368

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

332

ఒక యోగి ఆత్మకథ

నని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా వెనకటి పాపాల పరిహారానికి, ఏ కొండల్లోకో పోయి ఏకాంతంగా దైవధ్యానం చేసుకుంటాను.’

“మా గురుదేవులు నన్ను దయతో చూశారు. ‘నీ చిత్తశుద్ధి నా మనస్సుకు తెలుస్తోంది.’ అన్నారు చివరికి. ‘నీ తొలుతటి ఏళ్ళ నిశ్చల విధేయతవల్లా ఇప్పటి నీ పశ్చాత్తాపంవల్లా నీ కొక వరం ఇస్తాను. నీ ఇతర శక్తులన్నీ ఇప్పుడు పోయాయి కాని, నీకు తిండి గుడ్డా కావలసినప్పుడు మాత్రం హజరత్‌ను పిలిచి ఇమ్మంటే ఇప్పటికీ ఇస్తాడు. ఏకాంత పర్వత ప్రాంతాలకు పోయి, దివ్యజ్ఞానం పొందడానికి నిండు మనస్సుతో సాధన చెయ్యి.’ ”

“మా గురుదేవులు అంతర్ధానమయారు. కన్నీళ్ళతో, ఆలోచనలతో ఒంటరిగా మిగిలిపోయాను. ఓ ప్రపంచచూ, ఇక సెలవు! ఆ విశ్వప్రేమమయుడి క్షమాభిక్ష అన్వేషించడానికి వెళ్ళిపోతున్నాను.