పుట:Oka-Yogi-Atmakatha.pdf/365

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లిం గారడివాడు

329

చేసే ఒకానొక చర్యవల్ల ఆకాశశక్తి (ఈథరిక్ ఎనర్జీ) నుంచి ఏ వస్తువుకు సంబంధించిన అణువుల నయినా సరే ఆకర్షించగలిగేవాడు. అయితే ఆ విధంగా సూక్ష్మశక్తి తో రూపొందించిన వస్తువులు నిర్మాణపరంగా క్షణభంగురమైనవి; వాటిని అట్టేకాలం నిలిపి ఉంచలేము.[1] అఫ్జల్ అప్పటికీ లౌకిక సంపదకోసం వెంపరలాడేవాడు; ఎంతో కష్టపడి సంపాదించవలసి వచ్చినా, ఎక్కువగా భరోసా పెట్టుకోదగినంత మన్నిక ఉన్నదది.

నేను నవ్వాను. “అది కూడా ఎప్పుడో, తెలియరాకుండానే మాయమవుతుంది లెండి!”

“అఫ్జల్ దైవసాక్షాత్కారం పొందినవాడు కాడు.” గురుదేవులు ఇంకా చెప్పారు. “చిరస్థాయిగాను, శ్రేయస్కరంగాను ఉండే అలౌకిక అద్భుత చర్యలు నిజమైన సాధువులే చెయ్యగలరు. వారు, సర్వశక్తి సంపన్నుడైన సృష్టికర్తతో ఐక్యానుసంధానం పొంది ఉండడమే దానికి కారణం. అఫ్జల్ చాలా మామూలు మనిషి; కాని మర్త్యులైన మానవులు సాధారణంగా చనిపోయిన తరువాత కాని ప్రవేశించలేని సూక్ష్మ మండలంలోకి చొచ్చుకుపోయే అసాధారణ శక్తి మాత్రం అతనికి ఉంది.”

“పరలోకానికి, మనల్ని ఆకట్టుకొనే లక్షణాలు కొన్ని ఉన్నాయన్న సంగతి ఇప్పుడు అర్థమవుతోంది. గురుదేవా!”

గురుదేవులు అంగీకరించారు. “ఆనాటి తరవాత మరెన్నడూ అఫ్జల్ ని నేను చూడలేదు. కాని కొన్నేళ్ళకి బాబు మా ఇంటికి వచ్చాడు. ఆ ముస్లిం తన తప్పు ఒప్పుకొంటూ చేసిన బహిరంగ ప్రకటన ఒక

  1. సూక్ష్మశక్తితో సృష్టించిన నా వెండి రక్షరేకు, చివరికి ఈ లోకం నుంచి అదృశ్యమయినట్టుగానే (అధ్యాయం : 42 లో సూక్ష్మలోకాన్ని వర్ణించడం జరిగింది).