పుట:Oka-Yogi-Atmakatha.pdf/364

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

328

ఒక యోగి ఆత్మకథ

“నాలుగో అద్భుత ప్రదర్శనావకాశం మా ఆతిథేయికి ఆహ్లాదం కలిగించిందనడంలో సందేహం లేదు; అఫ్జల్ అప్పటికప్పుడు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చెయ్యడానికి సంసిద్ధత ప్రకటించాడు!”

“ ‘చాలా ఖరీదైన వంటకాలు పురమాయిద్దాం,’ అన్నాడు బాబు, దిగులుగా. ‘నా ఐదువందల రూపాయలకీ సరిపోయేటట్టు అనేక రకాల వంటకాలు కావాలి. ప్రతి పదార్థం బంగారపు పళ్ళాల్లో వడ్డించాలి!’

‘ప్రతివాడూ తనకు కావలసినవేవో చెప్పగానే ఆ ఫకీరు హజరత్‌ను మళ్ళీ పిలిచాడు. గలగలా చప్పుడు మొదలయింది; బంగారపు పళ్ళాలు శూన్యంలోంచి మా కాళ్ళ దగ్గిరికి దిగివచ్చాయి. వాటినిండా, రకరకాల దినుసులతో జాగ్రత్తగా వండిన కూరలు, వేడివేడి రొట్టెలు (లూచీలు), ఆ ఋతువులో ఎక్కడా కనిపించని రకరకాల పళ్ళు అమిర్చి ఉన్నాయి. పదార్థాలన్నీ మంచి రుచిగా ఉన్నాయి. ఒక గంటసేపు తృప్తిగా విందు ఆరగించిన తరవాత మేము గదిలోంచి బయటికి రావడం మొదలు పెట్టాం. పళ్ళాలు దొంతర పెడుతున్నట్లుగా బ్రహ్మాండమైన చప్పుడు వినిపించడంతో మేము వెనక్కి తిరిగి చూశాం. తళతళడాడే బంగారపు పళ్ళాల జాడ కూడా లేదక్కడ; ఎంగిళ్ళు కూడా లేవు.”

“గురుదేవా,” అంటూ, ఆయన మాటకి అడ్డు తగిలాను. “ఆ అఫ్జల్, బంగారపు పళ్ళాలవంటి వస్తువులు అంత సులువుగా సంపాదించ గలిగినప్పుడు పరాయివాళ్ళ ఆస్తికోసం వెంపర్లాడడం ఎందుకండి?”

“ఆ ఫకీరు ఆధ్యాత్మికంగా ఎక్కువ అభివృద్ధి సాధించలేదు.” అంటూ వివరించారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “ఒకానొక యోగప్రక్రియ వల్ల అతనికి ఒక సూక్ష్మమండలంలోకి ప్రవేశం కలిగింది. అందులో ఏ కోరిక అయినా తక్షణం నెరవేరుతుంది. హజరత్ అనే ఒక సూక్ష్మ మండల జీవి సహాయంతో అతడు, బలిష్ఠమైన తన సంకల్పశక్తితో