పుట:Oka-Yogi-Atmakatha.pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

304

ఒక యోగి ఆత్మకథ

సంపూర్ణ తార్కిక వివేకశక్తులు లేని జంతువులకే పరిమితమై ఉంది. అందువల్ల భగవంతుడు మొట్టమొదటి మానవశరీరాన్ని సృష్టించి, వాటికి సాంకేతికంగా ఆదాము, అవ్వ (ఏడమ్ ఆండ్ ఈవ్) అని పేర్లు పెట్టాడు. ఊర్ధ్వగతిలో లాభకరమైన పరిణామం కోసం రెండు జంతువుల ఆత్మల్ని లేదా దివ్యసారాన్ని వాళ్ళలోకి ప్రవేశపెట్టాడు.[1]

ఆదాములో, అంటే పురుషుడిలో, వివేకం ప్రాధాన్యం వహించింది. అవ్వలో, అంటే స్త్రీలో, అనుభూతి ప్రాధాన్యం వహించింది. ఆ ప్రకారంగా భౌతిక లోకాలకు ఆధారభూతమై ద్వంద్వం లేదా ధ్రువత్వం అభివ్యక్తమయింది. పశుప్రవృత్తిపరమైన కుండలినీశక్తి మానవ మనస్సును ఏమార్చనంతకాలం వివేకం, అనుభూతి పరస్పర సహకారంతో ఆనంద స్వర్గధామంలో విహరిస్తాయి.

“కనక, మానవ శరీరం, కేవలం జంతువులనుంచి పరిణామ ఫలితంగా ఏర్పడ్డది కాదు; దేవుడి విశిష్ట సృష్టిద్వారా ఉత్పన్నమయినది. జంతురూపాలు సంపూర్ణ దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యలేనంత స్థూలమైనవి. మూలపురుషుడికీ మూలస్త్రీకీ అత్యద్భుతమైన మానసిక శక్తి - అంటే మెదడులో సర్వజ్ఞతా శక్తిసంపన్నమైన ‘సహస్రారకమలం’, వెన్నులో సున్నితంగా జాగృతమైన షట్చక్రాలు-విశిష్టంగా ప్రసాదించడం జరిగింది.

“తొలుత సృష్టించిన జంటలో నెలకొన్న దేవుడు, లేదా దివ్యచేతన,

  1. “దేవుడు నేలమీద మట్టితో మనిషిని తయారుచేశాడు; అతని ముక్కు రంధ్రాల్లోకి ఊపిరి ఊదాడు, అప్పుడు మనిషి జీవించే ఆత్మ అయాడు.” -జెనిసిన్ 3 :7.