పుట:Oka-Yogi-Atmakatha.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

303

వివరించారు. “దాంట్లో చెప్పిన ‘జీవనవృక్షం’ మానవదేహం. వెనుబాము, తలకిందులుగా ఉండే చెట్టులాంటిది. మనిషి తలవెంట్రుకలు దానికి వేళ్ళు; అంతర్వాహక బహిర్వాహక నాడులు దానికి కొమ్మలు. నాడీమండలమనే వృక్షానికి మనం అనుభవించి ఆనందించదగ్గ ఫలాలు చాలా కాస్తాయి. శబ్దస్పర్శరూప రసగంధాలనే ఇంద్రియ జ్ఞానాలే ఆ ఫలాలు. మనిషి వీటిని హక్కుభుక్తం చేసుకోవచ్చు. కాని అతనికి, దేహోద్యానం ‘మధ్యలో’ ఉన్న ‘ఆపిల్’ పండు, అంటే లైంగికానుభవం, నిషిద్ధం.[1]

“అందులో చెప్పిన ‘సర్పం’, లైంగికనాడుల్ని ఉద్రేకపరిచే కుండలినీశక్తిని, సూచిస్తుంది. ‘ఆదాము’ వివేకానికి సంకేతం; ‘అవ్వ’ అనుభూతికి సంకేతం. ఏ మనిషిలోనయినా భావోద్రేకాన్ని అంటే స్త్రైణ స్పృహను, కామవాంఛ లోబరుచుకున్నట్లయితే అతని వివేకం, అంటే ఆదాము, నశించక తప్పదు.[2]

“దేవుడు తన సంకల్పబలంతో స్త్రీ పురుష శరీరాల్ని రూపొందించి మానవజాతిని సృష్టించాడు. ఈ కొత్తజాతికి ఆయన, తన మాదిరి ‘నిష్కళంక’ రీతిలో, లేదా దివ్యరీతిలో పిల్లల్ని సృష్టించే శక్తి ప్రసాదించాడు.[3] అంతవరకు వ్యష్టిగా పరమాత్మ ఆవిర్భావం సహజాతబద్ధమై,

  1. “మనం తోటలో ఉన్న చెట్ల పండ్లు తినవచ్చు; కాని తోట మధ్యలో ఉన్న చెట్టు పండుమాత్రం మీరు తినగూడదనీ, మీలో ఏ ఒక్కరూ కూడా దాన్ని ముట్టుకోగూడదని లేకపోతే చనిపోతారనీ దేవుడు చెప్పాడు.” - జెనిసిస్ 3 : 2-3.
  2. “నాకు తోడుగా ఉండడానికి నువ్విచ్చిన ఆడది ఆ చెట్టుపండు నాకు ఇచ్చింది; నేను తిన్నాను. ఆ పాము నన్ను మభ్య పెట్టింది, నేను తిన్నాను అందా ఆడది.” - జెనిసిన్ 3:1 2-13.
  3. ఆ ప్రకారంగా దేవుడు మనిషిని తనకు ప్రతిరూపంగా సృష్టించాడు; దేవుడి రూపంలోనే అతన్ని సృష్టించాడు; స్త్రీపురుషుల్ని సృష్టించాడు. దేవుడు వాళ్ళని దీవించాడు; వాళ్ళతో ఇలా చెప్పాడు; ఫలవంతులై వంశాభివృద్ధి చెయ్యండి. భూమిని సుసంపన్నం చెయ్యండి; దాన్ని లోబరుచుకోండి.” - జెనిసిన్ 1: 27-28.