పుట:Oka-Yogi-Atmakatha.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

298

ఒక యోగి ఆత్మకథ

శ్రీ యుక్తేశ్వర్‌గారు ఇప్పటి యుగానికి[1] 24,000 సంవత్సరాల అయనచక్రాన్ని అన్వయింపజేసే గణితశాస్త్ర విధానాన్ని కనిపెట్టారు. ఈ చక్రాన్ని రెండుగా విభజించి ఒకటి ఆరోహణ చాపంగాను, రెండోది అవరోహణ చాపంగాను పేర్కొన్నాను. ఒక్కొక్క చాపం కాలపరిమితి 12,000 సంవత్సరాలు. ప్రతి చాపంలోనూ ‘కలి, ద్వాపర, త్రేతా, సత్య’ యుగాలనే నాలుగు యుగా లుంటాయి. ఈ నాలుగు యుగాల్నీ గ్రీకుల మతానుసారంగా లోహ, కాంస్య, రజత, స్వర్ణయుగాలని అంటారు.

మా గురుదేవులు రకరకాల లెక్కలు కట్టి, ఆరోహణచాపంలోని కడపటి ‘కలియుగం’ అంటే లోహయుగం, క్రీ. శ. 500 ప్రాంతంలో మొదలయిందని నిర్ధారణ చేశారు. 1200 సంవత్సరాల కాలపరిమితిగల ఈ లోహయుగం, భౌతిక వాద ప్రధానమైన కాలం. ఇది క్రీ. శ. 1700 ప్రాంతలో ముగిసింది. ఆ సంవత్సరం ‘ద్వాపరయుగం’ ఆరంభమయింది. దీని కాలపరిమితి 2,400 సంవత్సరాలు. ఈ యుగం విద్యుచ్ఛక్తి అణుశక్తుల వికాసానికి టెలిగ్రాఫ్, రేడియో, విమానాలవంటి దేశ వ్యవధానాన్ని హరింపజేసే యంత్రాలకూ ప్రాముఖ్యం వహించే యుగం.

3,600 సంవత్సరాల కాలంగల ‘త్రేతాయుగం’ క్రీ.శ. 4,100 లో మొదలవుతుంది. టెలిపతీ (మానసిక ప్రసారం) ప్రసారాలగురించి, కాల వ్యవధానాన్ని హరింపజేసే ఇతర సాధనాలగురించి జనసామాన్యానికి తెలిసి ఉండడం ఈ యుగ లక్షణం. ఆరోహణచాపంలో కడపటి యుగమైన ‘సత్యయుగం’ కాలపరిమితి 4,800 సంవత్సరాలు. ఈ యుగంలో

  1. ఈ ఆయన చక్రాన్నిగురించి శ్రీ యుక్తేశ్వర్‌స్వామివారు ‘కైవల్య దర్శనం’ (ది హోలీ సైన్స్) అనే పుస్తకంలో వివరించడం జరిగింది (యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా, 21, యు. ఎన్. ముఖర్జీ రోడ్డు, దక్షిణేశ్వరం, పశ్చిమబెంగాలు, భారతదేశం.)