పుట:Oka-Yogi-Atmakatha.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

271

సూక్ష్మ స్పందనలకు మించి మరేమీ కావు. ప్రతివేపు నుంచీ వెలువడుతుండే వేలాది కార్యక్రమాల్లోంచి మనకి కావలసిన సంగీత కార్యక్రమాన్ని సరిగా ట్యూన్ చేసిన రేడియో అందుకునేటట్టుగా, శ్రీయుక్తేశ్వర్‌గారు, లోకంలో మానవ మనస్సులు ప్రసారంచేసే లెక్కలేనన్ని ఆలోచనల్లోంచి ఒకానొక (ఒక గోబిపువ్వు కోసం వెంపరలాడుతున్న ఆ వెర్రి బాగులవాడి) సుసంగతమైన ఆలోచనను సూక్ష్మగ్రహణశక్తితో కనిపెట్టారు. సముద్రపు ఒడ్డున షికారుకు వెళ్తున్న సమయంలో ఆ రైతుకున్న చిన్న కోరిక తెలుసుకోగానే దాన్ని తీర్చాలని సంకల్పించారు. రోడ్డుమీద తైతక్కలాడుతూ వస్తున్న మనిషిని, అతను శిష్యుల కనుచూపు మేరలోకి రాకముందే, శ్రీయుక్తేశ్వర్‌గారి దివ్యచక్షువు కనిపెట్టింది. ఆశ్రమం తలుపుకి తాళం వెయ్యడం విషయంలో నా మతిమరుపు, నా విలువైన శాకాల్లో ఒకటి నాకు దక్కకుండా చెయ్యడానికి గురుదేవులకు సదుపాయమైన మిష కల్పించింది.

ఆ విధంగా గ్రాహక పరికరంలా పనిచేసిన తరవాత శ్రీయుక్తేశ్వర్‌గారు, ప్రబలమైన తమ సంకల్పశక్తిద్వారా, బ్రాడ్ కాస్టర్‌గా – అంటే ప్రేషక, పరికరంగా పనిచేశారు.[1] ఆ ప్రకారంగా తమ పాత్ర నిర్వహిస్తూ ఆయన, ఆ రైతు వెనక్కి తిరిగి వెళ్ళి ఒకేఒక కాలీఫ్లవర్ కోసం ఒకానొక గదిలోకి ప్రవేశించేటట్లు నిర్దేశించడంలో కృతకృత్యులయారు.

సహజావబోధం (అంతర్జ్ఞానం, లేదా అంతఃస్ఫురణ) ఆత్మ చూపించే ముందు దారి; ఇది, మనిషి మనస్సు ప్రశాంతంగా ఉన్న క్షణాల్లో అతనిలో సహజంగానే కనిపిస్తుంది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో, వివరించడానికి శక్యంకాని విధంగా, జరగ

  1. అధ్యాయం : 28 లో మొదటి అధోజ్ఞాపిక చూడండి.