పుట:Oka-Yogi-Atmakatha.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

213

నా చిన్నప్పుడు , కొద్దికాలం నాకు చదువుచెప్పిన ఒక మాస్టరుగారి దగ్గర తప్పుడు పాఠాలు కొన్ని ఒంటబట్టించుకున్నాను. శిష్యుడయిన వాడు లౌకిక విధుల నిర్వహణ కోసం ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం లేదని నాకు చెప్పడం జరిగింది. నేను నా పనుల్ని ఉపేక్షించడం గాని, అజాగ్రత్తగా చెయ్యడంగాని జరిగినప్పుడు నన్ను మందలించలేదు. మానవ ప్రకృతికి, అల్లాటి బోధలు ఒంట బట్టించుకోడం చాలా సులువుగా కనిపిస్తుంది. అయితే గురుదేవుల కఠిన శిక్షణలో, బాధ్యతారహితమైన మనోజ్ఞమైన భ్రమల్లోంచి త్వరగానే బయటపడ్డాను.

“ఈ లోకానికి అతిమంచిగా ఉండేవాళ్ళు వేరొక లోకానికి శోభ చేకూరుస్తున్నవాళ్ళు,” అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారొకనాడు. “ఈ భూమిమీద ఉచితంగా లభించే గాలి పీలుస్తున్నంతకాలం, కృతజ్ఞతా పూర్వకమైన సేవ చెయ్యవలసిన బాధ్యత మనమీద ఉంటుంది. ఊపిరి ఆడని సమాధిస్థితి[1]ని పూర్తిగా సాధించినవాడు మాత్రమే ప్రాపంచిక విధుల నుంచి విముక్తి పొందుతాడు.” అని చెబుతూ ఆయన, “నువ్వు అంతిమ పరిపూర్ణత్వం సాధించినప్పుడు ఆ విషయం నీకు తెలియజెయ్య కుండా ఉండను,” అన్నారు పొడిగా.

ప్రేమతో నయినా సరే, మా గురువుగారిని ఆశపెట్టి అనుకూలంగా మార్చుకోలేము. నాలాగ, ఆయనదగ్గిర శిష్యరికం చేయ్యడానికి మనఃపూర్వకంగా అంగీకరించినవారెవరి విషయంలోనూ ఆయన మెతకతనం చూపించలేదు. గురువుగారికీ నాకూ చుట్టూ ఆయన విద్యార్థులుకాని పరిచయంలేని పరాయివాళ్ళు కాని ఉన్నా సరే, మేము ఏకాంతంగా ఉన్నా సరే ఆయన ఎప్పుడూ దాపరికంలేకుండా మాట్లాడుతూ చెడామడా చివాట్లు పెట్టేవారు. తెలివితక్కువతనంవల్ల కాని, అసందర్భంగాగాని చిన్న

  1. సమాధి, ఆధిచేతనత్వం.