పుట:Oka-Yogi-Atmakatha.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

201

వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున, ఈ శరీరాన్ని లాహిరీ మహాశయుల ఇంటికి చేరవెయ్యడమే అసాధ్యమనిపించింది.

“ ‘గురుదేవా, మళ్ళీ జబ్బుగా ఉందండి.’ ”

“మా గురుదేవుల చూపు దురవగాహంగా ఉంది. ‘అంటే, మళ్ళీ జబ్బు తెచ్చుకున్నావన్నమాట.’ ”

“నాలో ఓర్పు నశించింది. ‘గురుదేవా, రోజు రోజుకూ మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను. నేను చెప్పిన నిజమైన సంగతులు మీ రెందుకు నమ్మరో అర్థం కావడం లేదు,’ అన్నాను.”

“ ‘నిన్ను మార్చి మార్చి ఒకసారి బలహీనంగానూ మరోసారి బలంగానూ చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే.’ గురువుగారు నావేపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం, నీ అవచేతన మనస్సులో సాగే ఆలోచనల్ని కచ్చితంగా ఎలా అనుసరిస్తోందో నువ్వే చూశావు. ఆలోచన అనేది విద్యుత్తులాగా, భూమ్యాకర్షణ లాగానే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తిమంతమైన చైతన్యంలో ఒక విస్ఫు లింగం. శక్తి యుక్తమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను.

“లాహిరీ మహాశయులు వ్యర్థంగా ఏదీ మాట్లాడరని తెలిసి నేను, అత్యంత శ్రద్ధాభక్తులతో, కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను ‘గురుదేవా, ఇప్పుడు నేను బాగా ఉన్నాననీ, నా వెనకటి బరువు నాకు వచ్చిందనీ అనుకుంటే అవి కూడా జరుగుతాయా?’ ”

“ ‘అలాగే జరుగుతాయి; ఈ క్షణంలోనయినా సరే.’ గురుదేవులు గంభీరంగా అన్నారు; ఆయన చూపు నా కళ్ళమీదే కేంద్రీకరించి ఉంది.

“తక్షణమే నాలో బలమే కాకుండా బరువు కూడా పెరిగినట్టు