పుట:Oka-Yogi-Atmakatha.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 1

మా తల్లిదండ్రులు,

నా బాల్యజీవితం

పరమసత్యాల అన్వేషణ, దానికి తోడుగా ఉండే గురుశిష్య సంబంధం భారతీయ సంస్కృతికి స్వాభావికమైన లక్షణాలుగా చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి.

నే ననుసరించిన మార్గం నన్ను దైవస్వరూపులైన ఒక ఋషి దగ్గరికి నడిపించింది. మహిమాన్వితమైన ఆయన జీవితం అనేక యుగాలకు ఆదర్శంగా నిలిచేటట్టు రూపొందినది. భారతదేశానికి నిజమైన సంపద అయిన మహానుభావుల్లో ఆయన ఒకరు. అటువంటి మహాపురుషులు ప్రతి తరంలోనూ ఆవిర్భవిస్తూ, ప్రాచీనకాలంలో ఈజిప్టుకూ బాబిలోనియాకూ పట్టిన గతి భారతదేశానికి పట్టకుండా కాపాడుతూ వచ్చారు.

నా స్మృతిపథంలోని మొట్టమొదటి జ్ఞాపకాలన్నీ ఒకానొక పూర్వ జన్మకు సంబంధించిన అస్తవ్యస్త విషయాలతో నిండి ఉన్నవి. చాలా వెనకటి జన్మలో ఎప్పుడో నేను, హిమాలయాల మంచు ప్రదేశాల మధ్య

ఒక యోగి[1]గా జీవించినట్లు సుస్పష్టమైన జ్ఞాపకాలు నా మనస్సులో మెదిలాయి. ఈ గతకాలపు జ్ఞాపకాల మెరుపులే, పరిమితిలేని ఏదో ఒక

  1. భగవద్‌ధ్యానానికి సంబంధించిన యోగం- అంటే "కలయిక" - అనే ప్రాచీన భారతీయశాస్త్రాన్ని సాధనచేసేవాడు (చూడండి అధ్యాయం 26 : 'క్రియా యోగశాస్త్రం'.