పుట:Oka-Yogi-Atmakatha.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

193

సహజమైన మాదిరిగా మగత నిద్రలోకి వెళ్తూండడం కద్దు. పక్క విషయంలో పట్టింపులేవీ లేవు. ఆయనకు తరచుగా, తలగడ లేకుండా కూడా, ఒక- సన్నటి బల్లమీద పడుక్కొనేవారు. ఆయన మామూలుగా వేసుకొనే పులిచర్మం దాని మీద పరుచుకునేవారు.

రాత్రి తెల్లవార్లూ తాత్త్విక చర్చ జరగడం అరుదైన విషయమేమీ కాదు; ఏ శిష్యుడయినా గాఢమైన ఆసక్తితో ఆ అవకాశం కల్పించవచ్చు. అప్పుడు నాకు అలసటే అనిపించేది కాదు; నిద్రపోవాలన్న కోరికే ఉండేది కాదు. గురుదేవుల ఉజ్జ్వల వాక్కులే చాలు. “ఓహో, తెల్లవారుతున్నదే! గంగ ఒడ్డున నడక సాగిద్దాం పదండి.” రాత్రిపూట జరిగే ఆధ్యాత్మిక బోధన కాలాలు అనేకం ఇలా ముగిశాయి.

శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గరి అంతేవాసిత్వంలో తొలికాలపు నెలలు ఉపయోగకరమైన పాఠం ఒకటి నేర్పాయి: “దోమను జయించడం ఎలా?” మా ఇంట్లో అయితే మా వాళ్ళు రాత్రిపూట దోమతెరలు కట్టుకుంటూ ఉండేవారు. జాగ్రత కోసం ఏర్పడ్డ ఈ ఆచారాన్ని శ్రీరాంపూర్ ఆశ్రమంలో పాటించకపోవడం చూసి నేను నిరుత్సాహపడ్డాను. ఆశ్రమంలో ఈ కీటకాలు లేక కాదు; సమృద్ధిగా నివాసం చేసేవి; తలనుంచి పాదాల దాకా నన్ను ఒళ్ళంతా కుట్టేసేవి. గురువుగారు నా మీద జాలి పడ్డారు.

“నువ్వో దోమతెర కొనుక్కో; అలాగే నాక్కూడా ఒకటి కొను.” ఆయన నవ్వుతూ ఇంకా ఇలా అన్నారు: “నువ్వు నీ ఒక్కడికోసమే కొనుక్కునేటట్టయితే దోమలన్నీ నా మీదికి వచ్చి పడతాయి!”

నేను అత్యంత కృతజ్ఞతతో ఆయన మాట పాటించాను. నేను శ్రీరాంపూర్ లో గడిపిన ప్రతి రాత్రీ, మా గురువుగారు, దోమతెరలు కట్టమని చెబుతూ ఉండేవారు.