పుట:Oka-Yogi-Atmakatha.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

194

ఒక యోగి ఆత్మకథ

ఒకనాడు దోమలు ఇక మబ్బులా మా మీదికి కమ్ముకొచ్చాయి. అయినా గురువుగారు రోజులా, తెరలు కట్టమని చెప్పలేదు. ఉత్సాహంగా ఆ కీటకాలు చేస్తున్న రొద వింటూంటే బెదురుపుట్టింది. నా పక్కమీదికి వెళ్ళి, వాటిని మంచి చేసుకోడానికి ఒక ప్రార్థన విన్నవించుకున్నాను. ఇలా ఒక అరగంట గడిచిన తరవాత, గురుదేవుల దృష్టిని ఆకర్షించడానికని చిన్నగా దొంగదగ్గు దగ్గాను. దోమకాట్లతో, ముఖ్యంగా రక్తదాహం తీర్చుకొంటూ గాయకమక్షికం చేసే రొదతో, నాకు పిచ్చెత్తిపోతుందేమో అనుకున్నాను.

నా దగ్గుకు జవాబుగా గురువుగారిలో కదలిక ఏమీ కనిపించలేదు. నేను జాగ్రత్తగా ఆయన దగ్గరికి చేరాను. ఆయన ఊపిరి తీసుకోడం లేదు. ఆయన యోగసమాధిలో ఉండగా దగ్గరినుంచి గమనించడం నాకు ఇదే మొదటిసారి; దాంతో నాకు భయం పట్టుకొంది.

“ఆయన గుండె ఆగిపోయి ఉండాలి!” నేను ఆయన ముక్కు కింద ఒక అడ్డం పెట్టాను. శ్వాస తాలూకు ఆవిరి ఏదీ కనిపించలేదు. నా అభిప్రాయాన్ని మరోసారి రూఢి చేసుకోడానికి, ఆయన నోరూ ముక్కురంధ్రాలూ కొన్ని నిమిషాలపాటు నా వ్రేళ్ళతో మూసి ఉంచాను. ఆయన ఒళ్ళు చల్లగా, నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏం చెయ్యాలో తెలియక, ఎవరినయినా సహాయానికి పిలుద్దామని గుమ్మం వేపు తిరిగాను.

“ఓహో! కుర్రపరిశోధకుడివా! అయ్యో, నా ముక్కు!” గురువుగారి కంఠస్వరం నవ్వుతో కంపిస్తోంది. “వెళ్ళి పడుకోవేం? ప్రపంచమంతా నీ కోసం మారాలా? నువ్వే మారు; దోమల్ని గురించిన స్పృహ వదుల్చుకో.”

నేను పిల్లిలా నా పక్కదగ్గరికి తిరిగి వెళ్ళాను. ఒక్క కీటకం కూడా నా దగ్గరికి రావడానికి సాహసించలేదు. పూర్వం దోమతెరల వాడ