పుట:Oka-Yogi-Atmakatha.pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వప్రేమలీల

145

చిన విజయం. ఈ “పరస్పర విరుద్ధాల సమన్వయం” హృదయాన్నీ బుద్ధినీ కూడా తృప్తి పరుస్తుంది; భక్తి జ్ఞానమూ ప్రధానంగా ఒకటే. ప్రపత్తి- అంటే దేవుణ్ణి “ఆశ్రయించడం,” శరణాగతి- అంటే “దేవుడి దయనే నమ్ముకొని తనను తాను అర్పించుకోడం,” అన్నవి నిజంగా, పరమోన్నతజ్ఞాన సాధనకు మార్గాలు.

మాస్టర్ మహాశయులకూ ఇతర సాధువులందరికీ ఉండే వినయం, దేవుణ్ణే ఏకైక ప్రాణంగానూ న్యాయమూర్తిగానూ భావించి, ఆయన మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉన్నామన్న (శేషత్వం) గుర్తింపువల్ల ఏర్పడినది. భగవంతుడి స్వరూపమే ఆనందం కాబట్టి, ఆయనతో భావైక్యం పొందినవాడు సహజమైన అపరిమితానందం అనుభవిస్తాడు. “ఆత్మా సంకల్పశక్తీ పొందే భావావేశాల్లో మొదటిది ఆనందం.”[1]

పసిపిల్లలకు సహజమైన హృదయంలో జగన్మాతను చేరే అన్ని యుగాల భక్తులూ, ఆవిడ ఎప్పుడూ తమతో ఆడుకొంటూనే ఉంటుందని ధ్రువపరుస్తారు. మాస్టర్ నుహాశయుల జీవితంలో, ముఖ్యమైన సందర్భా

  1. సెంట్ జాన్ ఆఫ్ ది క్రాస్. ప్రీతిపాత్రుడయిన ఈ క్రైస్తవ సాధువు 1591 లో కన్ను మూశాడుచ 1859 లో ఈయన భౌతికకాయాన్ని బయటికి తవ్వి తీసినప్పుడు ఏ మాత్రం చెడిపోకుండా కనిపించింది. సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్వెండ్ (‘అట్లాంటిక్ మంత్లీ’, డిసెంబరు 1936), తనకు కలిగిన విశ్వానందానుభవాన్ని గురించి ఇలా చెప్పాడు: ఉల్లాసంకన్నా ఉత్సాహంకన్నా ఎంతో ఎక్కువ ఆనందానుభూతి నాకు కలిగింది: ఒకానొక ఆనందాతిరేకంతో నా ఒళ్ళు నాకు తెలియలేదు. వర్ణించనలవి కాని, దాదాపు భరించ శక్యంకాని ఈ ఆనందానుభూతి కలగడంతో, ప్రపంచానికి సారభూతమైన, మంచితనం కూడా నాకు అవగాహన అయింది. మనుషులు అంతరంగంలో మంచివాళ్ళే ననీ వాళ్ళతో కనిపించే చెడు పైపైది మాత్రమేననీ, కాదనడానికి వీలులేనంత గట్టిగా నమ్మకం. కుదిరింది.”