పుట:Nutna Nibandana kathalu.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్యజాతివారు క్రైస్తవులైనప్పడు మోషే ధర్మశాస్రాన్ని అనుసరించి సున్నతి పొందితేనే గాని రక్షణం లభించదని వాదించారు. పౌలు బర్నబాలు ఈ వాదాన్ని ఖండించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి అపోస్తలులు యెరూషలేములో సమావేశం ఏర్పాటు చేశారు. సున్నతి పొందాలనే వాళూ, అక్కర లేదనే వాళ్లు తమవాదనలు విన్పించారు. పేతురు రక్షణం క్రీస్తు ద్వారానే లభిస్తుందని చెప్పాడు. యెరూషలేము సమాజానికి పెద్దయైన యాకోబు అతనితో ఏకీభవించాడు. కనుక అన్యజాతివారు క్రైస్తవులైనపుడు సున్నది పొందనక్కరలేదని నిర్ణయించారు. వాళ్లు అన్యులు విగ్రహాలకు పెట్టిన ఆహారం తినరాదనీ, జారత్వానికి దూరంగా వుండాలనీ, గొంతు పిసికి చంపిన జంతువులను తినరాదనీ మాత్రం ఆజ్ఞాపించారు. ఈ విషయాలను లేఖలతో వచ్చిన దూతల ద్వారా అంతియోకయ సమాజానికి తెలియపరచారు. ఈ సమావేశం క్రీ.శ. 50లో జరిగింది.

105. రెండవ ప్రేషిత యాత్ర - అచ 16-18,22

పౌలు తాను పూర్వం వేదబోధ చేసిన నగరాలను మళ్లా దర్శించాలి అనుకొన్నాడు. బర్నబా మార్కుని వెంట తీసికొని పోగోరాడు కాని పౌలు అంగీకరించలేదు. అతడు మొదటి యాత్రలో పెర్గనుండి వెనుకకు వెళ్లిపోయాడు కదా! ఈ విషయమై యిద్దరికీ వాదోపవాదాలు జరిగి విడిపోయారు. బర్నబా ఒక జట్టుగా, పౌలు ఇంకొక ಜಟ್ಟಗ್ వెళ్లిపోయారు.

పౌలు లుస్తలో తిమొతి అనే శిష్యుణ్ణి కలసికొన్నాడు. అతనికి మంచి పేరుంది. తిమొతి తండ్రి గ్రీకు జాతివాడు కావడంచే పౌలు అతనికి సున్నతి చేయించాడు. ఆ మీదట అతడు పౌలుకి నమ్మిన బంటుగా సేవలు చేశాడు.

పౌలు బితూనియా రాష్ట్రంలో వేదజోధ చేయగోరాడు. కాని ఆత్మ అంగీకరించలేదు. త్రోయలో మాసెడోనియా పౌరుడొకడుపౌలుకి కలలో కన్పించి నీవు మా రాష్ట్రానికివచ్చి మాకు బోధచేయమని వేడుకొన్నాడు.