పుట:Nutna Nibandana kathalu.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పేతురుని గూడ చెరలో పెట్టి పాస్కపండుగ తర్వాత చంపించ గోరాడు. క్రైస్తవ ప్రజలు అతనికొరకు ప్రార్ధన చేశారు. దాని ఫలితంగా దేవదూత పేతురుని అద్భుతంగా చెరనుండి బయటికి తీసికొని వచ్చాడు. అతన్ని చెరసాల వెలుపల వదలిపెట్టి అదృశ్యమయ్యాడు. పేతురు మార్కు తల్లి యింటికి పోయాడు. రోడా అనే సేవకురాలు తలుపుతీసింది. పేతురు అచట ప్రోగైయున్న విశ్వాసులను కలసికొని అక్కడినుండి రోముకు వెళ్లిపోయాడు. పేతురు కన్పించనందున హేరోదు ఆగ్రహం చెంది చెరసాల బంట్రితులను చంపించాడు. అతడు కైసరయలో సింహాసనం మీద కూర్చుండి ప్రజలకు ఉపన్యాసం చేశాడు. జనం అతన్ని మెప్పించడానికి నీవు దేవుళ్లాగ మాటలాడావని పొగడారు. ఆ పొగడ్తకు హేరోదు తబ్బిబ్బు లయ్యాడు. కాని దేవదూత అతన్ని శిక్షించినందున ఫచోరవ్యాధితో మరణించాడు.

103. పౌలు మొదటి ప్రేషిత యాత్ర - అచ 13-14

ఆత్మప్రేరణపై అంతియొకయలోని సమాజం బర్నబా సౌలులను అన్యజాతివారికి క్రీస్తుని బోధించడానికి పంపింది.వారు మొదట సైప్రసు దీవిలో క్రీస్తుని బోధించారు. ఆ మండలానికి పాలకుడు సెర్జియ పౌలు. అతడు వాక్యం వినగోరి బర్నబా సౌలులను ఆహ్వానించాడు. కాని బార్ యేసు అనే మాంత్రికుడు సెర్జియకు అడ్డు తగిలాడు. సౌలు అతన్ని కోపించి నీవు గ్రుడ్డి వాడవు ఐపోతావు అని శపించాడు. వెంటనే అతనికి చూపు పోయింది. మండల పాలకుడు శ్రద్ధతో సౌలు బోధను ఆలించాడు. ఈ సంఘటనం నుండి లూకా సౌలుకి పౌలు అనేపేరు మాత్రమే వాడాడు.

పెర్గ వద్ద మార్కు ప్రేషితబృందాన్ని వదలివేసి యెరూషలేముకి తిరిగివచ్చాడు. అటుపిమ్మట పౌలు బర్నబాలు పిసిడియా మండలంలోని అంతియొకయనగరం ప్రవేశించారు. పౌలు అక్కడి ప్రార్థనా మందిరంలో