పుట:Nutna Nibandana kathalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్ని రకాల జంతువులు వున్నాయి. నీవు వీనిని చంపి తిను అని ఓ స్వరం విన్పించింది. కాని వానిలో యూదులు తినగూడని అపవిత్ర జంతువులు కూడ వున్నాయి. కనుక పేతురు నేను అపవిత్ర మృగాలను తినకూడదు అని జవాబిచ్చాడు. ఆ స్వరం దేవుడు పవిత్ర పరచినవి అపవిత్రమైనవి కావు అని పల్కింది. ఈ దర్శనం అతనికి మూడుసార్లు కన్పించింది. దీని భావమేమిటా అని పేతురు ఆలోచిస్తూండగా కొర్నేలి పంపిన జనం అతని దగ్గరికి వచ్చారు. వారి ఆహ్వానాన్ని అందుకొని పేతురు కొర్నేలి యింటికి వెళ్లాడు. అక్కడ కొర్నేలి స్నేహితులతో, బంధువులతో పేతురు కొరకు వేచివున్నాడు. తనకు కలిగినదర్శనాన్ని పేతురుకి విన్నవించి అయ్యా! మేము నీ సందేశాన్ని వినడానికి సిద్ధంగా వున్నామని చెప్పాడు.

పేతురు ఈలా బోధించాడు. దేవునికి పక్షపాతం లేదు. మంచి ప్రవర్తన కలిగిన నరుణ్ణి ఏ జాతి వాణ్ణయినా దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు యేసుద్వారా నరులను రక్షింపగోరాడు. యూదులు యేసుని సిలువవేయగా తండ్రి అతన్ని జీవంతో లేపాడు. అతని మరణోత్థానాలకు మేము సాక్షులం. ఇప్పడు యేసుని విశ్వసించి పాపాలకు పశ్చాత్తాపపడితే మీరు కూడ రక్షణం పొందుతారు అని పల్మాడు. అతడు ఈలా చెప్తుండగానే పవిత్రాత్మ కొర్నేలి బృందంపై దిగివచ్చింది. పేతురుతో వచ్చిన యూదులు అన్యజాతి వారు కూడ ఆత్మను పొందడం చూచి విస్తుపోయారు. పేతురు కొరేలికీ అతని బంధుమిత్రులకూ జ్ఞానస్నానం ఇచ్చాడు. దర్శనంలో కన్పించిన అపవిత్ర జంతువులు అన్యజాతి ప్రజలేనని పేతురు గ్రహించాడు. 102. చెరలో పేతురు - అచ 12

102. చెరలో పేతురు - అచ 12

మొదటి హేరోదు మనుమడైన హేరోదు అగ్రిప్ప యూదయాకు రాజయ్యాడు. అతడు యోహాను అన్న యాకోబును చంపించాడు.