పుట:Nutna Nibandana kathalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవసరం లేదు. మీ అభిప్రాయం ఏమిటి అని తోడి పెద్దలను అడిగాడు. వాళ్లు ఇతనికి మరణశిక్ష పడాలి అన్నారు. అది యూదుల మహాసభ నిర్ణయం.

77. పేతురు బొంకు -మత్త 26,69-27,8

పేతురు కైఫాయింటి వసారాలో మంటదగ్గర కూర్చుండి చలికాచు కొంటున్నాడు. ఓ దాసి నీవు కూడ యేసుశిష్యుడవే కదా అంది. అతడు నాకు తెలియదు అని బొంకాడు. తర్వాత ఇంకో దాసి ఇతడు కూడ యేసు అనుచరుడే అంది. పేతురు అతడెవరో నాకు తెలియదు అన్నాడు. అటు పిమ్మట అక్కడి జనం నీవు కూడ అతని శిష్యుడవే. నీ మాటల్లోని యాసే నిన్నుపట్టియిస్తుంది అన్నారు. పేతరు మళ్లా అతన్ని నేను ఎరుగను అని వొట్టు బెట్టి చెప్తున్నాను అన్నాడు. అంతలోనే కోడి కూసింది. కోడి కూయక మునుపే నీవు నన్నెరుగనని ముమ్మారు బొంకుతావని క్రీస్తు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని పేతురు వెలుపలకు వెళ్లి పుట్టెడు దిగులుతో ఏడ్చాడు. యూదా యేసుకి మరణ శిక్ష పడ్డం చూచి చింతించి ముప్పది నాణాలు ప్రధానర్చకుల దగ్గరికి తెచ్చి నేను నిరపరాధిని అప్పగించి పాపం కట్టుకొన్నాను. మీ సొమ్మ మీరు తీసికోండి అని అడిగాడు. వాళ్లు ఆ విషయం మాకు పట్టదు. అది き。 సమస్యకాని మా సమస్య కాదు అన్నారు. యూదా ఆ సొమ్ము దేవాలయంలో విసరికొట్టి వెళ్లిపోయి నిరుత్సాహంతో ఉరివేసికొన్నాడు. యూజకులు ఆ సొమ్ముతో పరదేశీయుల భూస్థాపనానికి కుమ్మరివాని పొలం కొన్నారు. కనుకనే దానికి నెత్తురు పొలం అని పేరువచ్చింది.

78. పిలాతు మరణశిక్ష విధించడం -లూకా 23,1-25

యూదులకు మరణశిక్ష విధించే హక్కులేదు. కనుక వాళ్లు క్రీస్తుని రాష్ట్రపాలకుడైన పిలాతు వద్దకు తీసికొని వచ్చారు. అతనితో ఇతడు ప్రజలను తిరుగుబాటుకి పురి గొల్పుతున్నాడు. నేనేమెస్సియాను, రాజును