పుట:Nutna Nibandana kathalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేశాడు. తిరిగి శిష్యుల దగ్గరికి వచ్చి మీరింకా నిద్రిస్తూనే వున్నారా? ఇక లేవండి. పాపులు మనుష్య కుమారుని బంధించడానికి వస్తున్నారు. నన్ను పట్టియిచ్చేవాడు రానే వచ్చాడు. అతన్ని కలసికోవడానికి పోదాం రండి అని చెప్పాడు.

75. యేసుని బంధించడం - మత్త 26,47-56

ఇంతలో యూదా యూదనాయకులు పంపిన పెద్దగుంపుతో వచ్చాడు. నేను ముదుపెట్టుకొన్న వ్యక్తిని మీరు బంధించండి అని అతడు వారికి ముందుగానే గురుతునిచ్చాడు. అతడు గురువా నీకు శుభం అంటూ క్రీస్తుని ముద్దుపెట్టుకొన్నాడు. వెంటనే ఆ వచ్చిన జనం అతన్ని బంధించారు. పేతురు ఎదురుతిరిగి కత్తి దూసి ప్రధానార్చకుని చెవిని తెగనరికాడు. కాని క్రీస్తు హింస పనికిరాదని చెప్పి పేతురు కత్తిని ఒరలో పెట్టించాడు. అతడు ఆ వచ్చిన జనంతో నేను రోజూ దేవాలయంలో బహిరంగంగా బోదిస్తున్నా మీరు నన్ను పట్టుకోలేదు. లేఖనాలు నెరవేరడానికి ఇప్పడు మీరు నన్ను ఈలా బంధించారు అని పల్కాడు. ఇదంతా చూచి శిష్యులు భయపడి క్రీస్తుని విడనాడి పారిపోయారు.

76. న్యాయపీఠం ఎదుట క్రీస్తు - మత్త 26,57-66

బంధితుడైన యేసుని జనం ప్రధానర్సకుడైన కైఫా వద్దకు కొనిపోయారు. అతడు యూదుల మహాసభను సమావేశపరచాడు. విరోధులు క్రీస్తు మీద ఏమి నేరం మోపుదామా అని ఆలోచించినా వారికి సరైన నేరం దొరకలేదు. కడన ఇద్దరు కూటసాక్ష్యులు ఇతడు దేవాలయాన్ని పడగొట్టి మళ్లా మూడు రోజుల్లో కడతానని పల్కాడు అని చెప్పారు. ప్రధానార్చకుడు క్రీస్తుని జవాబు చెప్పమని అడగ్గా అతడు మౌనంగా వుండిపోయాడు. కైఫా మళ్లా నేను ఒట్టబెట్టి అడుగుతున్నాను. నీవు మెస్సియావా అని అడిగాడు. క్రీస్తు నీవు అడిగినట్లే. ఇకమీదట మీరు మనుష్యకుమారుడు దేవుని కుడిప్రక్కన కూర్చోవడం చూస్తారు అని జవాబు చెప్పాడు. కైఫా బట్టలు చించుకొని ఇది దేవదూషణం. ఇక సాక్ష్యంతో