పుట:Nutna Nibandana kathalu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్నాను అని చెప్పాడు. ప్రభువు నీవు పరిపూరుడివి కాగోరితే నీ యాస్తిపాస్తులను అమ్మి పేదలకు దానం చేయి. ఆ పిమ్మట వచ్చి నన్ను అనుసరించు అని చెప్పాడు. కాని ఆ యువకునికి తన సంపదలు వదలు కోవడం ఇష్టం లేదు. కనుక యేసు పలుకులు విని బాధతో వెళ్లిపోయాడు. ఆ పిమ్మట ప్రభువు శిష్యులతో ధనవంతుడు దైవరాజ్యంలో ప్రవేశించడం కంటె ఒంటె సూది బెజ్జంలో దూరడం సులభం. ఐనా దేవుడు దనవంతుల బుద్ధిని మార్చి వారికి గూడ రక్షణాన్ని ప్రసాదించగలడు అని చెప్పాడు.


60. ద్రాక్షతోటలో కూలీలు - మత్త 20,1-16

క్రీస్తు దైవరాజ్యం ఈలా వుంటుందని తెలియజేయడానికి ఓ సంఘటనం చెప్పాడు. ఒక ద్రాక్షతోట యజమానుడు కూలీల కొరకు వెదుకుతున్నాడు. ఉదయాన్నే సంత వీధిలోని కూలీలను చూచి రోజుపనికి ఒక దీనారం చెల్లించే ఒప్పందంపై వారిని తోటకు పంపాడు. తిరిగి తొమ్మిదిగంటలకు, పన్నెండు గంటలకు, మధ్యాహ్నం మూడు గంటలకు, ఐదు గంటలకు కూడ కూలీలను ఆలాగే తోటకు పంపాడు. సాయంకాలం కూలీ డబ్బులు ఈయడం చివరనవచ్చిన జట్టుతో ప్రారంభించారు. వారికి ఒక దీనారం ముట్టింది. మొదట వచ్చిన వాళ్లకు కూడ ఒక దీనారమే యిచ్చారు. మొదటి జట్టు వాళ్లు మేము ఎక్కువకాలం పని చేశాం గనుక మాకు ఎక్కువ కూలి రావాలి కదా అని గొణిగారు. యజమానుడు నేను న్యాయం తప్పలేదు. మీకు యిస్తానని వొప్పకున్న కూలి యిచ్చానుగదా! ఆలస్యంగా వచ్చిన వారిమీద దయకలిగి వారికి కూడ నిండు కూలి యిచ్చాను. నా సొమ్ము నేను ఉదారంగా వెచ్చించాను. మీకు బాధ యెందుకు అన్నాడు. దేవుడు కరుణ కలలాడు. అతని కొరకు కొద్దికాలం శ్రమజేసినా ఫలితం దక్కుతుంది.


61. లాజరుని జీవంతో లేపడం - యోహా 11

బెతానియాలోని మార్తా మరియల తమ్ముడు లాజరు జబ్బు పడ్డాడు. అక్కాచెల్లెళ్లు క్రీస్తుకి కబురు పెట్టారు. ఐనా ప్రభువు రెండు