పుట:Nutna Nibandana kathalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాపు పట్టకపోతే అప్పడే నరికివేద్దాం అన్నాడు. పాపి త్వరగా పశ్చాత్తాప పడాలి. లేకపోతే అతనికి దేవుని శిక్ష తప్పదు.

57. పదిమంది కుష్టరోగులు -లూకా 17,11-19


ఒక గ్రామం వెలుపల పదిమంది కుష్టరోగులు వున్నారు. యేసుని చూడగానే వాళ్లు అయ్యా! మా పై దయజూపు అని వేడుకొన్నారు. ప్రభువు వారిని అర్చకుల వద్దకు పంపాడు. కుష్టలేదని ధ్రువీకరించేది వాళ్లే. ఆ రోగులకు దారిలోనే కుష్ట నయమైంది. వారిలో ఒకడు మాత్రం తిరిగివచ్చి ప్రభువుకి నమస్కారం చెప్పాడు. అతడు కూడ యూదుడు కాదు సమరయుడు. ప్రభువు పదిమందికి నయమైతే దేవునికి వందనాలు చెప్పేది ఒక్కడేనా అని అడిగాడు. దేవుడు తాను మనకు దయచేసిన నానా వరాలకు మనం కృతజ్ఞలమైవుండాలని కోరుకొంటాడు. ఐనా ఆ మంచిగుణం చాలామందిలో వుండదు.

58. పరిసయుడు - సుంకరి - లకా 18,9-14

ఇద్దరు నరులు ప్రార్థనకు దేవాలయానికి వెళ్లారు. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు దేవుని యెదుట తన్ను తాను పొగడుకొన్నాడు. నేను భక్తి మంతుణ్ణి, ఉపవాసాలు చేసేవాణ్ణి, నా ఆదాయంలో పదోవంతు చెల్లించేవాణ్ణి. నేను ఇతర పాపుల్లాంటి వాణ్ణి కాను అని చెప్పకొన్నాడు. సుంకరి పీఠానికి దూరంగా నిలబడి రొమ్ము బాదుకొని దేవా! నేను పాపిని, నన్ను కరుణించు అని వేడుకొన్నాడు. దేవుడు పరిసయుని త్రోసిపుచ్చి సుంకరి ప్రార్థన ఆలించాడు. నేను మంచివాణ్ణి ఇతరులు చెడ్డవాళ్లు అనుకోవడం తగదు. దేవుని యెదుట మన తప్పిదాలను మనం ఒప్పకోవాలి.


59. ధనిక యువకుడు - మత్త 19, 16-26

ఓ ధనిక యువకుడు క్రీస్తుని సమీపించి మోక్షాన్ని పొందడానికి నేనేమి చేయాలి అని అడిగాడు. ప్రభువు పదియాజ్ఞలను పాటించు అని చెప్పాడు. ఆ యువకుడు అయ్యా నేను చిన్నప్పటి నుండి వీటిని పాటిస్తూనే