పుట:Niganttu Cheritramu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిఘంటుచరిత్రము.

8

బడినది. ప్రతిశబ్దము వ్యుత్పన్నమా యవ్యుత్పన్నమా? ప్రతిశబ్దమునకు వ్యుత్పత్తిఁ జెప్పుట శక్యమగునా కాదా? అది యవసరమా యనవసరమా యను విచారణఘు, నుపసర్గ నిపాతలను గుఱించి విమర్శయు వేదమంత్రముల కర్థమున్నదా లేదా యను విచారణముఁ జేయఁబడినది.

ఇచ్చట "వేదమును గుఱించి కొంచెము ప్రశంసించుట యస్థానము కా దని సాయభిప్రాయము.

వేద మనఁగా నెద్ది ? దానికి విషయ సంబంధ ప్రయోజనంబు లెవ్వి? అధికారి యెవ్వఁడు ? అను ప్రశ్నముల కుత్తరము లిట్లు చెప్పఁబడుచున్నవి. లోకములో మనుజులు తమకు మేలుఁ గలిగించుకొనుటకుఁ గీడుఁ దొలఁగించుకొనుటకు నుపయోగించు నలౌకికోపాయము నేగ్రంథము బోధించునో దానికి వేదమని పేరు. ఇచట నలౌకిక మను విశేషణమువలన నిది ప్రత్యక్షానుమానములకంటె వేఱైన దని తెలియఁబడు చున్నది. అనుదిన మనుభూయమానము లగు స్రక్చందనవనితాదు లిష్ట ప్రాప్తిహేతువు లనియు నౌషధ సేవాదిక మనీష్టనివారణహేతు వనియు నెల్లవారికిఁ దెలిసిన విషయమే. తానొక విషయము ననుభవింపఁగాఁ దనకుఁ గలుగునానందము మఱియొకపురుషుఁడా విషయమునే యనుభవింపఁగా వానికిఁ గూడ నట్టియానందము కలిగియుండవచ్చునని తానూహించుకొనుట యనుమానముచే సిద్ధించుచున్నది. ఇట్లైనచో రాఁబోవుజన్మమందుఁ గలుగుసుఖదుఃఖాదులు కూడ ననుమానముచేఁ దెలియఁబడునని పలికెద వేమో; అట్లు కాదు. ఆ విశేషములు మన కీజన్మమందుఁ దెలియవు. జ్యోతిప్టోమాదీ కర్మ లిప్తప్రాప్తిహేతువు లనియుఁ, గళంజభక్షణ త్యాగమనిష్టపరిహారహేతు వనియుఁ దెలుపఁబడు నీయర్థము నెంతగొప్ప తార్కికుఁడై నను వేద వ్యతిరిక్తానుమానసహస్రములచే నైనఁ దెలిసికొనుటకు సమర్థుఁడు కాఁడు. కావున నట్టియలౌకికోపాయమును బోధించునదియే వేద మని వేదమునకు లక్షణముఁ జెప్పినచో సమంజసముగా నుండును.

“ప్రత్యకే ణానుమిత్యా వా యస్తూ పాయోనబుద్ధ్యతే
ఏవతం విదంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా"

(ప్రత్యక్ష ప్రమాణముచేఁ గాని యనుమాన ప్రమాణముచేఁ గాని యేయుపాయము తెలియఁబడదో యాయుపాయమును దీనిచే మనుజు లెఱుంగుచున్నారు గావున దీనికి వేద మని పేరు.) అట్టియుపాయమే వేదమునకు