పుట:Niganttu Cheritramu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4

నిఘంటుచరిత్రము.

విషయము. దానినిఁ దెలియఁజేయుటయే దీనికిఁ బ్రయోజనము. ఆయుపాయమునుఁ దెలిసికొనఁగోరువాఁ డధికారి. అయ్యధికారితో నుపకార్యోపకారకభావము సంబంధము. (అధికారి యువకరింపఁ బడు వాడు. ఉపాయ ముపకరించునది.) నా కెల్లపుడును మేలగును గాక, కీడు తొలఁగును గాక ! అనియే ప్రతి మనుష్యునికి లోకములోఁ గోరిక పొడముచుండుట వలన ద్విజులే గాక ద్విజేతరు లగు స్త్రీశూద్రాదులందుఁ గూడ వేదమం దధికారము కలవారు కావలసివచ్చును. కాని స్త్రీ,శూద్రులకుఁ బూర్వోక్తమగులౌకికోపాయమునుఁ దెలిసికొనుట కభిలాష యున్నను హేత్వంతరముచే వారికి వేదమం దధికారము నిషేధింపఁబడినది. ఉపనయన మైనవానికే వేదాధికారము కలదని చెప్పిడు శాస్త్రముపనయనార్హత లేని స్త్రీశూద్రులకు వేదాధ్యయనమనిష్టావహ మని బోధించుచున్నది. అట్లైన యెడ నిష్టప్రాపకము ననిష్టనిరాసకమునగు నయ్యలౌకికోపాయము స్త్రీశూద్రు లెఱుంగుట యెట్లు ? దానిమూలముగా వారు తరించుట యెట్లు సంభవించు నని యడిగినచోఁ బురాణాదులనుఁ జదువుకొని వారు తరించెదరు. కావుననే "స్త్రీ, శూద్ర ద్విజుబంధూనాం త్రయీ నశ్రుతిగోచరా ఇతి భారత మాఖ్యానం మునినా కృపయా కృతం" (స్త్రీలు, శూద్రులు, బ్రాహ్మణాధములు, వేదమును వినఁగూడదు. కావున వారియందు దయగలవాఁడై శ్రీ వేద వ్యాసమహషి౯ భారతాఖ్యానమును రచించెను.) కాఁబట్టి యుపనయనాధికారము గల త్రైవర్ణికులకే (బ్రాహణక్షత్రియవైశ్యులకే) వేదమందధికారము, అలౌకికోపాయమును బోధించునది గావున వేదముయొక్క ప్రామాణ్యము స్వతస్సిద్ధము. పౌరుషేయవాక్యము బోధక మైనను బురుషునియం దుండు భమ విప్రలంభాదిదోషములవలనఁ బ్రవర్తించునని యూహింపబడియుండుటచే నాదోషములను నివారించుట కది మూలప్రమాణసాపేక్షమై యుండును. వేద మట్లు కాదు, అది నిత్యము గావునఁ గర్తృదోషశంక దానియందుదయింపదు. పూర్వమాంసాసూత్రకర్త యగుజైమిని యీయంశము నిట్లు చెప్పెను. “ఔత్పత్తికస్తు శబ్ద్యస్యార్దేన సంబంధ సస్యజ్ఞాన ముపదేశః ! అవ్యతిరేకశ్చా ధే౯ఽనుపలభ్దే తత్ప్రమాణం బాదరా యణస్యా నపేక్షత్వాత్ (1అ . 1 పా. 5 సూ) కాని ఋచసామాని జజ్జిరే ఛన్దాగ్ంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత" పు-సూ, అనియును, అన్య మహతో భూతస్య నిశ్వసితం యదృగ్వేదో యజుర్వేద స్సామవేదః"