పుట:NelooreJillaGramaNamaluBhashaSamajikaParishilana.djvu/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

(చంద్రగిరి రాజు) గజపతులనుండి ఉదయగిరిని జయించెను. ఆయనను కసిగట్టి గజపతులు దానిని తిరిగి సంపాదించుకొనిరి. సాళ్వు నరసింహుడా విచారముతోనే చనిపోయెను.

క్రీ. శ. 1513 ప్రాంతమున నుదయగిరిని ప్రతాపరుద్ర గజపతి పరిపాలించెను. పూర్వము విజయనగర సామ్రాజ్యమునకు చేరిన నుదయగిరిని మరల కైవశము చేసికొనుటకై కృష్ణారాయలు ఉదయగిరి మీదికి దండెత్తెను. అపుడా దుర్గమభేద్యమై యెల్లవేళల బదివేల కాల్బలముతో, నాలుగు వందల గుర్రపు దళములతో సంరక్షింపబడుటచే, రాయలా దుర్గమును పదునెనిమిది నెలలు భీషణ సంగ్రామ మొనరించి ఆక్రమించి, ఆ దుర్గాధ్యక్షుని పినతండ్రియైన ప్రహరేశ్వర పాత్రుని చెరబట్టి విజయనగరమునకు గొనిపోయెననియు ఉదయగిరి రాజ్యమునకు రాయసం కొండముర్సయ్యను దండనాధునిగా నియమించెననియు చరిత్ర గలదు.

క్రీ. శ. 1610 ప్రాంతమున మీర్ జుమ్‌ లా నాయకత్వమున గోల్కొండ నవాబుచే సైన్యము పంపబడి కంపరాయలోడింపబడెను. గోల్కొండ నవాబుల తరువాత దుర్గమార్కాటు నవాబుల వశమై ఆ వంశస్థులలో ఆఖరువాడగు అబ్బాస్ ఆలీ ఖాన్ నుండి ఆంగ్లేయులు క్రీ. శ. 1839లో స్వాధీనపరచుకొనిరి. (వి. మం. స. పుట 123)