Jump to content

పుట:NelooreJillaGramaNamaluBhashaSamajikaParishilana.djvu/110

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉదయగిరి దుర్గము- సముద్రమట్టమునకు 3079 అడుగుల నెత్తున నున్న నుదయగిరి కొండమిద కళింగ రాజగు లాంగూల గజపతిచే తొలుత నిర్మింపబడి, తదనంతరమేలిన భూవరులచే నభివృద్ధి గాంచెను. ఉదయగిరి భువనేశ్వర సమీప పర్వతములలో నొకదాని పేరు. కనుక యీ ఉదయగిరి కూడ గజపతుల చేతనే స్థాపింపబడినట్లు స్పష్టము. ఉదయగిరి రాజధానిగా లాంగూల గజపతి కడప నెల్లూరు మండలములేలినట్లు బాస్వెల్ పండితుని యభిప్రాయము.

క్రీ. శ. 1350 - 57 లో బుక్కరాయల జ్యేష్ఠ సోదరుడగు కంపరాయ లుదయగిరిని రాజధానిగా జేసికొని తూర్పుపరగణా నేలుచుండినట్లు తెలియుచున్నది. కంపరాయల తనయులలో మొదటివాడైన శ్యావన్న యొడయర్ క్రీ. శ. 1356 సం|| నకే ఉదయగిరి రాజధానిగా నుదయగిరి రాజ్యమును, విక్రమసింహపురి (నెల్లూరు) రాజధానిగా నుదయగిరి రాజ్యములోని ములనాటిని, పాకనాటిని బాలించినట్లు శాసనములవలన తెలియుచున్నది.

కటక పురాధిపతి కపిలేంద్ర గజపతి జైత్రయాత్ర వెడలి క్రీ. శ. 1460 ప్రాంతమున నుదయగిరిని గెలిచినట్లు శాసనము గలదు. విజయనగరము నేలిన రాజవంశములలో రెండవ వంశమునకు చెందిన సాళ్వు నరసింహులు