ఈ పుట అచ్చుదిద్దబడ్డది
నస్సు", మఱి "యేతెన్సుటైమను జీవన" మనుటకు సందియము లెదు. "నీ యిష్టానుసారము" (As you like It) జగమున నాటకరాజ మన వచ్చును. లోకులకు నుత్తములవల్ల న్మఱియు వీచులనుండియు నొక్క తీరుగనే నీతిని బోధింపచ్చుగాని యుత్తముల సత్ప్రవర్తనముల నీతి గఱుపుట పండితాభిరుచి, నీచుల దుష్ప్రవర్తన మగపర్చి నీతి రెల్పుట పామరంజకము.
కాళిదాసుని నాల్గునాటకములలో నతనివి కావనుకొన్న మాలవి కాగ్నిమిత్రప్రహసనములు గాక తక్కిన రెండింటిలో ననేకపండితుల యభిప్రాయము శాకుంతలము శ్రేష్ఠమని, కాని విక్రమోర్వశీయమే మేలుగ గన్పట్టెడు, భర్తలకుగూడ భార్యలుండగా మఱియొకతెం గూడ నెంచుట యట్టిదోసము కాదొకో! పురుషు డింకొకతె నాసించు నట్లు స్త్రీ వేఱొకని గాంక్షింపదగదా? అందానిం గవగూడిన నా నేరము సైచునని భార్యపాదములకు భర్తమ్రొక్కునట్లు వానింగలసిన నాతప్పోర్చుకొమ్మని భర్తపాదములకు భార్యమ్రొక్కుట సరసము కాదట. స్త్రీకి బాతివ్రత్యమువలె బురుషున కేకపత్నీ వ్రతము ముఖ్యము కానేరదో! ఒకరి కట్టింకొకరికి ముక్కతగునా? భారతీయ నాటకములలో దక్షిణనాయకత్వము సభాసదులకు దుర్నీతి బోధము.
విక్రమోర్వశీయ శాకుంతల మాలవికాగ్నిమిత్రములలో నాయకులు వేశ్యనొకడు, వేశ్వకూతు నొకడు, వేశ్యావేషమున నున్నదానిని నొకడు క్రమముగా వలచి, యగ్నిహోత్రసాక్షిగా బరిణయమాడుకొన్న భార్యల న్వంచిరి. శాకుంతలమున సఖులతో బూలుగోయుచున్న శకుంతల తేనెటీగెకు జడసి చెలుల న్సాయమునకై పీలిచినపుడు చెట్లుచాటునం బొంచియున్న సార్వభౌముడగు దుష్యంతుడు "పురువంశపురాజు భూమినేలు చుండగా ముద్దరాండ్ర కైవడనజ్ఞసేయుచున్నాడనురా" యని కత్తిజుళీపించుచు నాపె దఱి