పుట:NavarasaTarangini.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కుఱుకుటదెంత సరసము? కనికర మా ముద్దియ (పాప మా ముద్దియ్యయదివఱ కచట రాజు నక్కియుంట యెఱుగకుండెనేని యతని యాకస్మికౌద్ధత్యమునకు జడి సి యొక్కపెట్టున బ్రాణములు గోల్పోయి యుండును. బ్రాహ్మణులు కణ్వముని కూతుచే నతిధ్యమందుమని రాజునకు జెప్పినపుడు తనలో సగియె యాపెజూచెద ననుకొన్న రాజు పూలమొక్కలకు నీర్యోయుచున్న శకుంతలంజూచి యిదే కణ్వముని కూతురని చెట్టుచాటునబొంచి యాపె చక్కదనము జూచి యూటలూరుట తనవంటి యుత్తమక్ష్రత్రి యున కర్హమైన పని గాదు. "తపస్సు బాగుగ జరుగుచున్నదా?" యని రాజడిగినపుడు శకుంతల మునికన్నెయయ్యుం బ్రత్యుత్తర మీబోక వేశ్యాకన్యవలె సిగ్గు నటించుట బ్ర్రాహ్మణ్యకులాచార విరుద్దము. రాజుచే దపోవనరక్షకై నియోగింపబడిన ధర్మాధికారినని రాజు నీచునివలె దబ్బరపలుకు టనుచితము. రాజు తా రాజభృత్యుడనని చెప్పుకొన్నప్పుడతనిజూచి శకుంతల శృంగారలజ్జ నగార్చుచు బండ్లికిలించుట మఱింత యనుచితము. "శకుంతలా! నీ తండ్రి వచ్చెడు." నని సకియలు రాజసన్నిధి ననంగానైన నాకేమని చిరాకుపడు టొక రసమా? ఇంక నాకోర్కె తీరుట కవకాశమున్నదని రాజు శకుంతల వేల్పుసానికూతురని తెలిసినపై ననుకొనుటచే నంతకుముందాపెమునికన్నె యని తెలిసియు మోహింఛుట దేన్యాయము? శకుంతలం జూపించి ప్రియంవద రాజుతో 'మఱేమడగెద ' రని పల్కునపు డాపె న్శకుంతల వ్రేళ్ళతో గొట్టి సానిటాక్కగపర్చెను. కేవలకన్య్హక కట్టి కడ్దగు ఘోరతప స్సీపెచే జేయబడదగినదా? యని మునికన్యక లతో రాజంత ప్రౌఢముగా బల్కునా? కన్యలకు మన్మధ వ్యాపార మన నర్ధము తెలియుటేట్లు? ఇప్పటికి స్తనకంపమని రాజు కన్యకలతో నిగూఢావయవర్ణమము సేయదగునా? శకుంతలకు దానుంగర