పుట:NavarasaTarangini.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముగ దెలియబడదు. మఱియు నొక మాతృభాష యొకజన్మదేశ మొకజాతి యొకవయసాక స్థితి కలవార లన్యోన్యము సహజముగా దెలిసికొందురు. "ఒకకొంత యెదిగిన సికమీద ముడిపువ్వుటేత్తులు దొరయు తాయతులుజుట్టి" యను సీసపద్యపాదమందలి యభిప్రాయము వచ్చునట్టింకొక సీసపద్యపాదము చెప్పుట గాని లేక చందస్సు మార్చి చెప్పుటగాని లేక పర్యాయపదంబుల న్దానికర్ధము చెప్పుటగాని యంతగా రసము పుట్టింపనేరసపుదు భాషాంతరీకరణ మున దద్రనమెట్లుత్పారిల్లును? మేనమామ పోల్కిగా గొంతవఱకు భాషాంతరీకరణమున నూహందెల్ప బీకులాడవచ్చును. విధిప్రేరితుడ నై షేక్సిపియర్కాళిదాసుల కవిత్వమందు నాయెన్నినకొన్ని సొగసులు సాహసంబున దెలుగునం దెలిపినాడ, నీ యాంధ్రంబున నొకవేళ నంతగా రుచిపొడనిచో నాంధ్రీకరనమున నాశక్తిలేమిగని యక్కవీశ్వరుల కొఱంత యేమాత్రము న్గాదని నేదెల్పనవసరము లేదు. షేక్సిపియర్కాళిదాసుల తారతమ్యము కొంతవఱ కీ పుస్తకంబున నాంధ్రులకు దెలియగలదని నానమ్మకము. మొగి, యెగి మొదలగుపదంబులు వ్యర్ధముగా నదుకవలయుగాన యతి ప్రాసవర్జ్యంబుగా బద్యములల్లిన భాగుగ నుండుననియు, సర్వజనసాధారణముగా దెలియుగాన గ్రామ్యమే కావ్యంబుల జెప్పుట యుచితమనియు, గణయతిప్రాసముల న్వ్యాకరణమున్మాని వచనకావ్యములు మాత్రమే చెప్పిన మఱింత సులభబోధకము లగుననియు కొందఱు నవనాగరికులవలె బల్కుచు గొంత వింతమార్పునకు గారణమగుచున్నారు. సంస్కృతమున తు,హి, వై, చారులుండెనగున నొగిమొగ్యాదులుం బాదపురాణ మాత్రఫలకములయ్యు జీట్లపేకలలోని జోకరుబొమ్మవలె నభీష్టార్ధసిద్దిదాయకములయి పద్యమును మేకుబిగింఫువలె దృఢపర్చును. గ్రామ్యమమితముగా బలుదేశంబులం బెక్కు తెఱుంగులుగ నేచబట్టి బేదముగనుండుగావున సర్వసాధారణముగ దెలియబడదు. సుశబ్దప్రయోగము పుణ్య