. D., Head, Dept. of Telugu ? Chairman, Bd. of PG. Studies Sc Faculty of Oriental Learning, A. U , Member of the Andhra University Syndicate & A. P. Sahiiya Akudami, Formerly Professor of Telugu, Leningrad University. U, S. S. R. - oJ CO j D ) - o eo u Q
సహృదయ భూమిక
నాట్య సంగీత సాహిత్యాది నైక కళా నైపుణ చణుడైన నారాయన దాసు గారు తన రచనలందును ఒక రస ప్రపంచ విరంచనుడై రాణీంచిన మహానీయుడు. ప్రాచ్యశ్చాత్య సాహిత్య రాసిక్య పార దృశ్వుడు. సునిశిత వైమర్శిక కృక్పథ సుధూర గామి. ఏవం విధలక్షణములకు సువిశాల లక్ష్య భూమిగా ఈ నవరస తరంగిణిని పంతరించి నారు నారాయణ దాసు గారు.
కవితలో విశ్వమును విశ్వములో కవితను దర్శించి తమ కావ్యనాటకములందొక రసజగత్తును ప్రగల్పింపజేసిన లోకైక మహాకవులు షేక్స్పియరు కాళిదాసులు. వారి సారస్వత మొక మహా సృష్టి. అగియుఒక అద్బుత రసజగత్తు. వారి అమృతలేఖిని నాశ్రయించి నవరసములు నెట్లు పరిపుష్టములైనవో వైనము వారిగా పటిష్ట ప్రణాళికముగా నిరూపించుటయే ఎతద్గంచ సముద్దేశము. ఇందామహాకవుల సర్వకావ్యనాటకములందలి ప్రముఖపద్యములు, ప్రసిద్దపంక్తులన్నియు వివిధ రసశీర్షికల క్రింద నింగడింపబడి యెదురుగా తదనువాద మెక్కువగా పద్యములలోనుఎడనెడ వచనములోను చూపబడినది. ఆంగ్లమున కనువాదము మిశ్రభాషయందును, సంసృత ప్రాకృతముల కనువాదము అచ్చతెలుగునందును సాగినది. ఒకభాష ననువదించు నట్టున ఆ భాషయొక్క పదమొక్కటైన అనువాదమున పడగూడదని దాసుగారి నియమము. అనువాద మెప్పుడును "అహో మూతచ్చేదీ తన పాండిత్య" మ్మను నట్ట్లుండరాదు. మూలపంక్తి పరమార్ధమును కరబడర మొనర్పవలెగాని దానిని మీరి కఠినపాకమున బడరాదు. తాతకు దగ్గులు నేర్పవలెనా? దాసు గారికి తెలియనివి కావీ సులువులు