పుట:NavarasaTarangini.djvu/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ మహద్గ్రందమున వివిధ మూలపంక్తుల అక్షర సూచనలు, సందర్బ వివరణము, మూలగ్రంధముల ఇతివృత్త సంగ్రహము అను వాదమునందలి కఠినశబ్దముల కర్ధవివరణమును గలవు. వీని యన్నిటిని మకుటాయమానముగ విపులమైన పీఠిక గలదు. అందు కవిత్వము- అనువాదము, ప్రాక్పశ్చిమ కావ్యమర్యాదలు, షేక్సిపియరు విశిష్టక, అనువార భాష, శ్రవ్య దృశ్య కావ్య తారతమ్యము, హేమ్లెట్ - శాకుంతలముల తులనాత్మక పరిశీలనము, రూపక ప్రయోజనము, శౌర్యత్రికము సంగీత సాహిత్యములు, సంప్రదాయము, ఆదునిక యుగము-అన్యద్భాషాస్థితి, కళలు-కవిత్వము, నరుల ఊహాపోహములు, మహాకవుల సందేశము, సత్కావ్యలక్షణము అను అమూల్య విషయములచేత నొక మహా సారస్వత స్రష్టయు ద్రష్టయునైన మహాభాగుని సూక్ష్మక్షికతో సమ్యగనుశీలితములై సకల జిజ్ఞాసూపాదేయములై పండితులుగూడా కనువిప్పు గలిగించునట్లు ఫరిడవిల్లుచున్నవి

ఈ గ్రంధ మెపుడో ఏబదియేండ్ల క్రిందట అచ్చుయినది-అదియు శతసహస్రముఖముగా సహృదయముల నుద్దీప్త మొనర్పగల దైదువందల ప్రతులుగా, ఎరిగినవారి ఉల్లములెల్ల కొల్ల గొట్టినదయ్యు ఎరుగనివారి నెందరికో దుర్లభమై కాలపురుషుని అంత:పురకాంత వలె కనుమరుగైపొయినది. ఇదిగో ఇపుడీ సహృదయ సార్వభౌము డీ యీశ్వరుని ధర్మమా యని ఆ గ్రంధ జగన్మాతృ దివ్య సౌందర్య దీధితులు సకలాంద్ర సహృదయ జగత్తుకుచ్చకచ్చకితముగా ప్రసరింప నున్నవి. ఎన్నడెన్నడటంచు చిరావాంఛితమున కీ ఈశ్వర సాక్షత్కారము మోక్షమొసగినది. రసజ్ఞ ప్రపంచ మాయనకు ఋణపడిపోయినది.

యస్వీ జోగారావు.

10-10-79