పుట:Navanadhacharitra.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

15

పొంకమై విరియు [1]నం ◆ బుజములక్రేవఁ
గ్రుంకి జలంబులఁ ◆ గొంతసే పుండి
లేచి యదిర్పడి ◆ లేచి లలాట
లోచనుఁ గౌఁగిట ◆ లోలతఁ జేర్చి
ముదమున జడ వట్టి ◆ ముంచిన పంచ
వదనుండు లేచి భ ◆ వాని వీక్షించి
క్రుంకెద నీ వింక ◆ గుఱుతుగాఁ జూడు
పంకజానన యని ◆ పలి కటు మునిఁగి
చువ్వన వేఱొక్క ◆ చోఁ బొడసూపి
నవ్వు భూతేశుని ◆ నగరాజపుత్రి
వడినీఁది చని పట్టి ◆ వంచినఁబట్టు
వదలఁగ దాఁటియు ◆ వడిదాఁగు జలము
తళ్లునఁ బెకలు మ ◆ స్తకమున జడలు
చల్లెడిపట్టుల సలి ◆ లంబు లాడు
దివిజకాంతల జిగిఁ ◆ దేరెడు చన్ను
గవలఁ బూసిన సిరి ◆ గందంపుఁ దావి
పొలయునీ కలసొంపు ◆ పొలయ ఝాళించు
కలహంస తతులఱె ◆ క్కల గాలిఁ గదలు
తోరంపుఁ దమ్ములఁ ◆ దొరఁగుపుప్పొళ్ల
సౌరభంబులు మెచ్చు ◆ సమకొల్పు నెడలఁ
[2]బొందొందఁ దటములఁ ◆ బుష్పించు తరుల
నిందిందిరముల రా ◆ యిడిఁ బడి రాలు
కుసుమవాసన లూఁదు ◆ కొని క్రమ్మునెడల
వెసఁదోయములఁ గ్రుంకి ◆ వెడలు దిక్కరుల
మదగంధములు మాఱు ◆ మలయు ఠావులను
మదనారి హిమవంతు ◆ మక్కువకూఁతుఁ
గదియ నీఁదుచు వేగఁ ◆ గదియలేకున్నఁ
గదియ వచ్చుచుఁ బట్టఁ ◆ గడఁగినఁజేతి
కగపడ కీరీతి ◆ నలయించి వెంటఁ
దగులింప మఱియొక్క ◆ తఱి నేమఱించి
మునిఁగి తోయములందు ◆ మును వోయి భవుని

  1. నంబుధి మలక్రేవ
  2. పొందొందవటముల బూజించుతరుల