పుట:Navanadhacharitra.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

14

నవనాథచరిత్ర

మరిగిన మదకల ◆ మల్లికాక్షములు
నంచ లంచలు వడి ◆ యంచితలీల
నంచల నున్నరా ◆ యంచల గములు
సార సముత్ఫుల్ల ◆ సారస తతుల
సారసంబుల నున్న ◆ సారసశ్రేణి
కావలిదెసహల్ల ◆ కావలికమ్మఁ
దావులు కడుపారఁ ◆ ద్రావు తుమ్మెదలుఁ
బుటపుటనై క్రొవ్వి ◆ పుటముగా నెగసి
[1]చటులతటిద్‌భ్రాంతి • సమకొనువాలు
వాలుగులునుగల్గి ◆ [2]వరలుచునున్న
మేలిమి మనముల ◆ మెచ్చులు నిగుడ
జలకేలి సలుపంగఁ ◆ జయ్యన నాత్మఁ
దలకొను వేడ్కభూ ◆ ధర రాజపుత్రి
దరి నీరు సొచ్చు న ◆ త్తఱిఁ దన్ముఖమును
[3]నరవిందమును దేంట్లు ◆ నలకపంక్తియును
గలికి కన్నులు నల్ల ◆ కలువలు నలరు
తెలినవ్వు నురువును ◆ దియ్యమోవియును
బొలుపారు బంధూక ◆ మును, [4]గంధరంబుఁ
జెలువారు శంఖంబుఁ ◆ జేతులుం బొసఁగు
బిసములుఁ జక్కవల్ ◆ బిగువుఁ జన్నులును
ననలారు నాభియు ◆ [5]నావర్తనంబు
నవ రోమరాజియు ◆ నాఁచుఁ దీగెయును
సరవి పిఱుందులు ◆ సైకతస్థలులు
నడుగులు [6]దరుణారు ◆ ణారవిందములు
దడఁబడుచుండె న ◆ త్తఱి సదాశివుఁడు
శ్రీతాద్రినందనఁ ◆ జేరి కై దండ
జాతిగా నిచ్చుచుఁ ◆ జనుఁగట్టు [7]బంటి
లోతున నిలిపి యో ◆ లోలాక్షి క్రుంకు
మీతోయముల మున్గు ◆ మీతోయ మనినఁ

  1. సటిత తటిభ్రాం
  2. వరులుసునయన. మేలిమిమడుగుట
  3. నరపిండము మదేంట్లు నలతపంక్తి
  4. డండరంబు
  5. ఆవర్తపర్యాయముగాఁబ్రయుక్తము
  6. నరుణారవిందంబులమర
  7. కట్టి