పుట:Navanadhacharitra.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

నవనాథచరిత్ర

మాకంద మిదెమందు ◆ మాకంద మబల
మాకందమగుఁ గాన ◆ మాకంద వెరవు
విరహుల చిత్తంబు ◆ విరవిరఁ బుచ్చు
విరవాది విరులు వా ◆ విరిఁ గోయఁ[1]బోవఁ
బరు వంద నీకేల ◆ బరు వందుచున్న
కురువిందపువ్వుల ◆ కురు వింద రమ్ము
నారజం బదె నయ ◆ నంబులలోన
నారజం బలికిన ◆ నారజం బగును
గేసరంబులు మించెఁ ◆ గేసరిమధ్య
కేసరంబులు మన ◆ కే సరియగును
వాలుఁగొమ్మలను గై ◆ వ్రాలు మంజరుల
వ్రేలఁ జూపెదఁ బూను ◆ వేళ గా దతివ
కేలఁ గైకొనుము నీ ◆ కే [2]లలితాంగి,
కేలికి మేలు కం ◆ కేలి క్రొవ్విరులు
జాతిగాఁ బద్మినీ ◆ జాతికిఁ దుఱుమ
జాతి మంచిదిపుష్ప ◆ జాతులలోనఁ
గొమ్మ యీసంపెంగ ◆ కొమ్మ తుమ్మెదల
కొమ్మ దా[3]పూరెమ్మ ◆ కొదల చే రెమ్మ
పొలఁతి మన్మథుజంత్ర ◆ బొమ్మ యీ నిమ్మ
అలివీడు పట్టుతొ ◆ య్యలి మొల్ల చెట్టు
మరుఁ డేలునట్టుకో ◆ మలి కలిగొట్టు
సరసఁ జెన్నారునీ ◆ సరసీరుహములు
కమ్మని తావులు ◆ గ్రమ్మ నింపెసఁగు
తమ్ములు చాలనె ◆ త్తమ్ము లై మెఱసెఁ
బసుడాలు నాకులు ◆ పచ్చని ఱెక్క
లెసఁగు కెంపుల డాలు ◆ నేలు తోరంపు
ముకుళంపు నెలవంక ◆ ముక్కులుం గాఁగ
[4] శుక భాతి దాల్చెఁగిం ◆ శుక మిందువదన
యనుచుఁ గాత్యాయని ◆ కనురాగ మాత్మఁ
[5] గనుచుఁ గో మలమౌ శు ◆ కపిక స్వరములు
వినుచు మయూరముల్ ◆ వేడ్క నటింపఁ

  1. బోయ
  2. కేలల
  3. పూలెమ్మకొదల చెరిమ్మ; బొరిమ్మ
  4. 'సుకుంభాంతిదాల్చె'
  5. చనుచు కోకిల శుకపిక.