పుట:Navanadhacharitra.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

11

పై వనకేళి స ◆ ల్పఁగ మదిఁ గోరి
వెలయంగఁ దనదిక్కు ◆ వీక్షించె నపుడు
తలఁపు లెఱింగి భూ ◆ ధరరాజపుత్రి
మురుపెంబు నిండార ◆ ముఖమండలమున
దరహాస చంద్రికల్ ◆ దళతళ నెసఁగఁ
గనుసన్నసేయు నా◆ కాల కంధరుని
పనుపునఁ బ్రమథులఁ ◆ బరిపాటి నిలిపి
[1]మరి వృషభేంద్రుఁ డ ◆ మర్త్యుల మునుల
నరుగుఁడు చనుఁడు మీ ◆ రని యున్నవారిఁ
దలఁగి పొమ్మనియె నం ◆ తటఁ గొల్వు మాని
వలసినలీల నీ ◆ శ్వరుఁడుఁ బార్వతియుఁ
జని మాతులుంగకా ◆ సార జంబీర
పనస పాటల పారి ◆ భద్ర హింతాళ
తాళ తమాల చం ◆ దన సిందువార
సాల కౌలేయ కే ◆ సర సురదారు
నాగకేసర వట ◆ నారంగ లికుచ
పూగ పున్నాగ క ◆ ర్పూర ఖర్జూర
మందార కేతకా ◆ మలక కదంబ
తిందుక కదళికా ◆ తింత్రిణీ ప్రముఖ
వినుత పాదపముల ◆ విలసిల్లు నొక్క
వనము ప్రవేశించి ◆ వలపుల నొసఁగు
పొలు పొందఁ జదలఁ బు ◆ ప్పొడి వెదచల్ల
నలరులు గోయంగ ◆ నలయుచు నున్న
కొండరాచూలిఁ గ ◆ [2] న్గొని భవదాస్య
పుండరీకంబుపొ ◆ ల్పులు దందడించు
నిందిందిరములకు ◆ నిదియె మం దనుచుఁ
బొందైన సంపెంగ ◆ పువ్వులబంతి
నెఱరంగు దలకించు ◆ నెఱివేణిమీఁద
నొఱవుగాఁ దుఱిమి కే ◆ లూఁతగా నిచ్చి
క్రొన్నన లొత్తి తూ ◆ కొననూఁది చనుచుఁ
బున్నాగ మల్లదె ◆ పున్నాగగమన

  1. మరియుషచం
  2. గనుంగొని భద్రాస్య, పుండరీకంబుల పులకలు సందడించి, నిందివరములక నిదియె మందనుచు.