పుట:Navanadhacharitra.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

నవనాథచరిత్ర

సన్నతఁ గృపఁజేసి ◆ చరియింతు ననుచు
సన్నుతస్థావర ◆ జంగమంబులకు
నురుబుద్ధి నుపకార ◆ మొనరించుకొఱకుఁ
గరమొప్ప కల్యాణ ◆ కటకంబు వెడలి
వచ్చె నా గురుగు హే ◆ శ్వర లింగలీల
నచ్చెరువందంగ ◆ నాత్రోవఁ గలుగు
ధరణీధరేంద్రముల్ ◆ తద్వీక్షణములఁ
బరుసంపు గిరులన ◆ భాసిల్లుచుండెఁ
గలతరుల్ దివిజ వృ ◆ క్షములన వెలసెఁ
లలితవల్లులు గల్ప ◆ లత లనవెలసెఁ
గొమరుమించిన కొలం ◆ కుల సలిలంబు
లమృతోపమానంబు ◆ లై విలసిల్లె
నిట్టి చందంబున ◆ నెలమిఁదా నడచి
మెట్టిన మార్గంపు ◆ మేదినియెల్లఁ
జిరపావనంబుగాఁ ◆ జేయుచుఁ జారు
చరితులై యుత్తరా ◆ శాశ్రితులైన
పరమపుణ్యులఁ జూతు ◆ భక్తిమై వార
లిరవొంద వేఁడిన ◆ నేమైన నిత్తు
నని సంతసిల్లుచు ◆ నల్లమ ప్రభువు
ఘనకృపాంభోరాశి ◆ గతిఁజను దేర
నామహాత్ముని చర ◆ ణాంబుజ స్పర్శ
సామర్థ్య సంపద ◆ జనఁగ [1]నెట్టెదురఁ
గ్రాలు నదీనద ◆ ప్రతతి పుణ్యంబు
లైలోక [2]పూజక ◆ ర్హంబులై వెలసెఁ
జెలఁగుచులీలని ◆ ల్చినఠావులెల్లఁ
జెలువొంద నిర్మల ◆ క్షేత్రంబు లయ్యె
నటఁజని ముందట ◆ నల్లమ ప్రభువు
దటముల దివ్యౌష ◆ ధంబులు గనులు
నిధినిధానంబులు ◆ నిర్మలంబైన
...... ....... ...... ...... ....... ...... .......
[3]సురల పాదపములు ◆ జూడఁ జిత్రంబు

  1. నెన్నెదుర.
  2. పూజారుహంబులై, అర్హ శబ్దమునకు ఆరుహమని శివకవుల గ్రంథముల గననగును.
  3. సురలు పాదుకలును.