పుట:Navanadhacharitra.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమా శ్వాసము

221

లగుబిలప్రతతులు ◆ నంజనంబులును
దగు సిద్ధరసములుఁ ◆ దలఁపు రత్నములు
నలజాతివైరంబు ◆ లన్నియు విడిచి
కలిసి చరించెడి ◆ ఖగమృగంబులును
జన నిక్కి చూచిన ◆ సత్యలోకమున
కను వొంద నెగయించు ◆ నచలశృంగములుఁ
బరుసవేదులనఁగఁ ◆ బ్రఖ్యాతమైన
పరవస్తువుల నందు ◆ వరుసన నెదుట
వెదకుచు లెక్కింప ◆ వెగ్గలంబైన
విదిత సాధకులకు ◆ విస్మయం బొదవ
నడపాడుతీఁగెలు ◆ నవ్వెడు తరులు
నుడివెడి శిలలును ◆ నూతన రుచుల
దీపించు పొదలును ◆ దివ్య తేజముల
నేపారవెలుఁగు మ ◆ హీరుహంబులును
ద్రావినమాత్ర నం ◆ తఃకరణములఁ
బావనంబుగఁజేయఁ ◆ బరగు మడుఁగులుఁ
దఱిఁయజొచ్చిన రసా ◆ తలముల గొందు
లెఱిఁగించు బిరుదున ◆ నెసఁగు బిలములుఁ
దడయక సాధక ◆ తతి దమ్ముఁ జుట్టి
యడిగిన వస్తువు ◆ లవి యెవ్వియయినఁ
ద్రవ్వితండములుగాఁ ◆ దడయక యిచ్చు
నవ్వసుధాధరో ◆ దారకూటములుఁ
గలిగి త్రిలోక వి ◆ ఖ్యాతమై మోక్ష
ఫలదమై మెఱయు శ్రీ ◆ పర్వతాగ్రంబుఁ
గనుఁగొని యామీఁదఁ ◆ గామితార్థములు
తనుఁజెందు ననుచు ను ◆ ద్దామ విముక్తి
గొనసాగ నున్నయా ◆ గోరక్షనాథుఁ
డనియెడి యట్టి స ◆ మర్ధసాధకుని
[1]నెలవునుగనిపట్టి ◆ నిర్మలమూర్తి
నలర వినోదార్థ ◆ మై యీశ్వరుండు
[2]రోగార్తలకుఁ గుష్టు ◆ రోగంబుమాన్ప
నేఁగుదెంచినలీల ◆ నెసఁగు జీవంబు

  1. నెలవుకొనియట్టి యానిర్మల.
  2. రోగార్థులను ... దాల్చి.